ఆవకాయ పెడుతున్న రక్షణ మంత్రి

First Published 4, Sep 2017, 12:37 PM IST
Highlights
  • కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రమాణస్వీకారం చేసిన కొద్ది సమయానికే ఆమెకు సంబంధించిన ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
  • నెటిజన్లను ఆకట్టుకుంటున్న నిర్మలా సీతారామన్ ఫోటో
  • తమిళనాడు రాష్ట్రంలో పుట్టి.. తెలుగింటి కోడలిగా అడుగుపెట్టిన వ్యక్తి నిర్మలా

రక్షణ శాఖ మంత్రి.. ఆవకాయ పెట్టడమేమిటి అనుకుంటున్నారా...? నిజమేనండి.. మన దేశ రక్షణ శాఖ మంత్రి ఆవకాయ పెట్టారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రమాణస్వీకారం చేసిన కొద్ది సమయానికే ఆమెకు సంబంధించిన ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటో ఎప్పటిదో.. ఎక్కడిదో.. ఎవరు తీసారో అనే సమాచారం మాత్రం తెలియదు. కాకపోతే.. ఒక పెద్దావిడ.. స్టూల్ పై కూర్చొని ఆవకాయ పెడుతుండగా.. నిర్మలా సీతారామన్ కూర్చొని చూస్తున్నారు.

 

‘ఈ ఫోటోలో నేల మీద కూర్చొని ఆవకాయ పెడుతున్న వ్యక్తే మన ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి’ అనే టైటిల్ తో దీనిని సోషల్ మీడియాలో పోస్టు  చేశారు. కాగా ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అయ్యింది. అయితే.. ఆ ఫోటోలోని ఆమెను చూసి.. ఆమె సింప్లిసటీ గురించి తెగ పొగిడేస్తున్నారు నెటిజన్లు. మీరు కూడా ఫోటో వైపు ఓ లుక్కేయండి.

 

తమిళనాడు రాష్ట్రంలో పుట్టి.. తెలుగింటి కోడలిగా అడుగుపెట్టిన వ్యక్తి నిర్మలా సీతామన్. కేంద్ర మంత్రి వర్గంలో ఆమెకు  కీలక పదవిని కట్టబెట్టంది మోదీ ప్రభుత్వం. భారత మాజీ ప్రధాని ఇందిరిగాంధీ మినహా ఇంతవరకూ ఎవరూ ఏ మహిళా పర్యవేక్షించని రక్షణ శాఖ ఆమెను వరించింది.

Last Updated 25, Mar 2018, 11:52 PM IST