ఇరుక్కుపోయిన కెకె అన్ని రహస్యాలు వెల్లడించాలి

Published : Jun 14, 2017, 07:35 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
ఇరుక్కుపోయిన కెకె అన్ని రహస్యాలు వెల్లడించాలి

సారాంశం

ఎలాగూ వ్యవహారం చెడింది కాబట్టి  కేశవరావు ధైర్యంగా ముందుకొచ్చి తనకూ గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు ఉన్న స్నేహమేమిటి, 2000 సంవత్సరం నుంచి గోల్డో స్టోన్ ప్రసాద్ ఏఏ రాజకీయనాయకులకు ఎలాంటి సహాయం చేశాడో వెల్లడించాలి. ఎంత మంది తెలుగు రాజకీయనాయలను ప్రసాద్ కాంగ్రెస్ హైకమాండ్ కు పరిచయం చేశాడో కెకె తెలుసు,  ఈ విషయాలు బయటపెట్టాలి.

తెలుగు రాష్ట్రాలలో అనేక మంది రాజకీయ నాయకులకు ఢిల్లీలో అండగా ఉండిన గోల్ల్ స్టోన్ ప్రసాద్ నడిపిన భూకుంభకోణంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు (కెకె) మీదే మొదటి దెబ్బ పడుతున్నది.

 

కుంభకోణంలో ఎంత పెద్ద వాడున్నా సరే చర్య లు తీసుకుంటామనే నిజాయితిని చాటుకునేందుకు కెకె ఇపుడు కెసిఆర్ ప్రభుత్వానికి పనికొస్తున్నారు.బలి అవుతున్నారు. కాకతప్పదు.

 

కెకె కూతరు విజయలక్ష్మి గద్వాల్ పేరు మీద ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని తెలంగాణా ప్రభుత్వంనిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో గతంలో జరిగిన ప్రభుత్వ / జంగ్లాత్‌ (అటవీ) భూముల రిజిసేట్రషన్లను రద్దుచేయాలని రెవిన్యూశాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

 

టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు కుటుంబసభ్యుల పేరు మీద ఇక్కడ 38 ఎకరాల ప్రభుత్వ భూమి రిజిస్టర్‌ అయింది. ఇలా గోల్డ్ స్టోన్ ప్రసాద్ చాలా మంది మీద భూప్రేమ చూపించి వుంటారు.

 

అయితే, ఈ భూముల రిజిస్ట్రేషన్‌లో ఎలాంటి వివాదం లేదని, హైకోర్టు డిక్రీ ఆధారంగా తాము రిజిస్టర్‌ చేయించుకున్నామని కేశవరావు మొత్తుకుంటున్న ప్రభుత్వం వినడం లేదంటే కెకె బలిఅవుతున్నట్లే లెక్క. ఇలాంటి అవకవతకలనుంచి భద్రత ఉంటుందనుకునే ఆయన  బువ్వ పెట్టిన కాంగ్రెస్ పార్టీని వదిలేసి టిఆర్ ఎస్ లో చేరాడు. ఇపుడు టిఆర్ ఎస్ ప్రభుత్వం కెకె కి ఈ వయసులో కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది.

 

 ఈ భూముల రిజిసే్ట్రషన్లను రద్దు చేస్తే తాను కోర్టుకెల్లానని  కెకె బెదిరిస్తున్నారు.

 

ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ భూములేనని ఇప్పటికే రెవెన్యూ అధికారులు తేల్చారు. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చారు. తాజాగా ఈ భూముల రిజిసే్ట్రషన్లు రద్దు చేయాలని సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి లేఖ పంపారు.  ఆ తర్వాతే కెకె భూముల రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని కెసిఆర్ ఆదేశించారు.

 

భూ కుంభకోణాల గోల్డ్ స్టోన్‌ కంపెనీ నుంచి కేశవరావుకు మంచిదోస్తు. అందువల్ల  కెకె కుటుంబ సభ్యులు  చవగ్గా ఈ భూములను ప్రసాద్ అందించారు. ఈ భూములను రిజిస్టర్‌ చేసిన ఇంచార్జి సబ్‌ రిజిసా్ట్రర్‌ సాలేహా ఖదీర్‌ ఇప్పటికే సస్పెండయ్యారు.అయితే, ప్రసాద్ చాలామంది ఢిల్లీలో అండగా ఉండేవారు. కొత్త గా ఢిల్లీ వచ్చిన ప్రముఖలందరికి ఏర్పాట్లు ఆయన చేసే వాడు. ఆయన మోతీ బాగ్ గెస్టు హౌస్ అడ్డ. ఈ లిస్టులో చాలా  మంది ఉన్నారు. వారిలో చాలా మంది ఇపుడు పవర్ లో ఉన్నారు.  ఈ భూముల వ్యవహారంలో వారు కూడా లబ్దిదారులా అనే విషయాన్ని కెకె లాంటి మేధావి బయటపెట్టాలి.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !