పద్మభూషణ్ అవార్డుకు పీవీ సింధు పేరు ప్రతిపాదన

First Published Sep 25, 2017, 11:39 AM IST
Highlights
  • పద్మ భూషణ్ అవార్డుకు పీవీ సింధు పేరు ప్రతిపాదన
  • పీవీ సింధు పేరు సిఫార్సు చేసిన క్రీడా శాఖ

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఖాతాలోకి మరో అత్యుత్తమ అవార్డు చేరే అవకాశం కనిపిస్తోంది. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన  వారికి ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు అందజేస్తుంది. ఈ ఏడాది ఆ అవార్డు కోసం క్రీడా శాఖ నుంచి పీవీ సింధు పేరును ప్రతిపాదించారు. కేంద్ర క్రీడా మంత్రుత్వ శాఖ ఆమె పేరును పద్మ భూషణ్ అవార్డు కోసం సిఫార్సు చేశారు.

 గత కొంత కాలంగా ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో సింధు తన సత్తా చూపిస్తోంది. 2016లో జరిగిన రియో ఒలంపిక్స్ లో రజతం సాధించిన సింధు.. చైనా ఓపెన్ 2016లో స్వర్ణం సాధించింది. ఈ ఏడాది జరిగిన  ఇండియా ఓపెన్ 2017 పోటీల్లో స్వర్ణం గెలుచుకుంది. అదేవిధంగా ఇటీవల జరిగిన కొరియా ఒపెన్ -2017లోనూ సింధు స్వర్ణ పతకాన్ని సాధించింది.

 రియో ఓలంపిక్స్ లో భారత్ తరపున బరిలో కి దిగిన సింధు.. ఫైనల్స్ లో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ఆమె కనపరిచిన ప్రతిభకు గానూ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆమె  అత్యున్నత క్రీడా పురస్కారం  ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు. ఆ సమయంలో సింధుతోపాటు  ఆమె కోచ్ గోపిచంద్ అర్జున అవార్డు అందుకున్నారు. అంతకముందు 2013లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ అవార్డను అందుకున్నారు.

click me!