
హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రేటర్ హైదరాబాద్ వైసిపి జనరల్ సెక్రటరీ మీర్జ ఆజం అలీ మృతి చెందాడు. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వస్తున్నపుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టు రోడ్డుపై కారు అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మీర్జ ఆజం అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మీర్జ ఆజం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.