ప్రజల చేతుల్లోకి జియో ఫోన్లు

First Published Sep 25, 2017, 11:03 AM IST
Highlights
  • మార్కెట్ లోకి జియో ఫోన్లు
  • 15 రోజుల్లో 60లక్షల ఫోన్ల పంపిణీ చేస్తామంటున్న రిలయన్స్ జియో

జియో స్మార్ట్ ఫోన్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. సోమవారం నుంచి రిలయన్స్ జియో కంపెనీ.. జియో స్మార్ట్ ఫోన్లను ప్రజలకు అందజేయనుంది.  ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 60లక్షల మంది జియో ఫోన్ ని బుక్ చేసుకున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 8లక్షల మందికిపైగా ఉన్నారు. సోమవారం నుంచి పంపిణీ ప్రారంభించగా.. 15 రోజుల్లో ఫోన్ బుక్ చేసుకున్న వారందరికీ ఈ జియో ఫోన్ ని అందజేస్తామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.

 

ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ ఫోన్లు అందజేస్తున్నామని.. తర్వాత  పట్టణ ప్రాంత ప్రజలకు అందజేస్తామని వారు చెప్పారు.  ఈ జియో  స్మార్ట్ ఫోన్ ధర రూ.1500 కాగా.. ఫోన్ బుకింగ్ సమయంలో రూ.500 చెల్లించిన వారు ఉన్నారు. అలా ముందస్తుగా రూ. 500 చెల్లించిన వినియోగదారులు.. డెలివరీ సమయంలో మిగిలిన రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.  అప్పుడు మాత్రమే ఫోన్ ని అందజేస్తారు. మళ్లీ బుకింగ్‌ ఎప్పుడు అన్న విషయాన్ని రిలయన్స్‌ జియో ఇంకా ప్రకటించలేదు. 

 

టెలికాం రంగంలో జియో ఒక సంచలనం సృష్టించింది. జియో దెబ్బకు దాదాపు అన్ని టెలింకాం రంగాలు కుదేలయ్యాయి. దీంతో జియోని తట్టుకునేందుకు కొన్ని టెలికాం సంస్థలు ప్రజలను ఆకర్షించడానికి పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.. మరికొన్ని కంపెనీలు ఏకంగా జియోకి పోటీగా తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ని అందజేయాలని చూస్తున్నారు. తక్కవ ధరకే స్మార్ట్ ఫోన్ ని అందజేస్తామని చెప్పి.. ప్రజలను ఆకర్షిస్తున్న రిలయన్స్ జియో కంపెనీ .. తాజాగా వాటిని మార్కెట్ లోకి ప్రవేశపెడుతోంది. మరి జియో స్మార్ట్ ఫోన్ ప్రజలను  ఎంతమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.

click me!