వైఎస్ ఆర్ కు ‘భారత రత్న’: వైసిపి డిమాండ్

First Published Jun 6, 2017, 6:52 PM IST
Highlights

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ‘భారత రత్న’ పురస్కారం ప్రకటించాలని  ప్రకాశం జిల్లా వైసిపి  డిమాండ్ చేస్తున్నది. గిద్దలూరు పార్టీ ప్లీనరీలో ఈ విషయం మీద చర్చ జరిగింది. రాజశేఖర్ రెడ్డి ‘భారత రత్న’  గౌరవానికి అన్నివిధాలుగా అర్హుడయిన నాయకుడని, ఆయనకు మరణానంతర పురస్కారం అందివ్వాలని పార్టీ గిద్దలూరు ఇన్ చార్జ్ ఐ వి రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ‘భారత రత్న’ పురస్కారం ప్రకటించాలని  ప్రకాశం జిల్లా వైసిపి  డిమాండ్ చేస్తున్నది. గిద్దలూరు పార్టీ ప్లీనరీలో ఈ విషయం మీద చర్చ జరిగింది. రాజశేఖర్ రెడ్డి ‘భారత రత్న’  గౌరవానికి అన్నివిధాలుగా అర్హుడయిన నాయకుడని, ఆయనకు మరణానంతర పురస్కారం అందివ్వాలని పార్టీ గిద్దలూరు ఇన్ చార్జ్ ఐ వి రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తిచేశారు.

 

పేదల సంక్షేమానికి సంబంధించి దేశంలో ఎక్కడా ఎవరూ యోచన కూడా చేయనిపథకాలను ప్రారంభించి సంక్షేమంలో ఒక కొత్త వరవడి వైఎస్ ఆర్ సృష్టించారని ఆయన అన్నారు. ప్రజలంతా ఆయనను సంక్షేమానికి మారుపేరుగా చేస్తున్నారని ఐవి రెడ్డి చెప్పారు.

 

‘‘ తెలుగు రాష్ట్రాలలో  ఎవరినైనా అడగండి, అది మగవారు కావచ్చు, మహిళ కావచ్చు. వైఎస్ ఆర్ పేదల కోసం ఏమిచేశారో  చెబుతారు. అంతేకాదు, హైదరాబాద్, పుణే, చెన్నై లలో పనిచేసే సాఫ్ట్ వేర్ కుర్రవాళ్లనడగండి, ఫీ రీయింబర్స్ పథకం వల్లే తాము ఇంజనీరింగ్ పూర్తి చేశామని, అందుకే ఈ ఉద్యోగాలొచ్చాయని చెబుతారు. దేశంలో 108 సర్వీస్ అనే కొత్త ఆరోగ్య సంక్షేమ పథకం వైఎస్ ఆలోచనలనుంచే వచ్చింది... ఇలా ఎన్నయినా చెప్పవచ్చు. ఇవన్నీ ఎక్కడ ఎపుడూ ఎవరూ చేపట్టని వినూత్న పథకాలు. వీటికి గుర్తింపుగా వైఎస్ ఆర్ కు ‘భారత రత్న’ పురస్కారం లభించాల్సిందే,’’ అని ఐవి రెడ్డి అన్నారు.

 

రాజశేఖర్ రెడ్డి పథకాలను అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని చెబుతు ఒక కొత్త సంక్షేమ యుగానికి వైఎస్ ఆర్ పునాది వేశారని రెడ్డి అన్నారు.

 

click me!