బంగారు ధర పెరుగుతూ ఉంది...

Published : Jun 06, 2017, 04:23 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
బంగారు ధర పెరుగుతూ ఉంది...

సారాంశం

బంగారు ధర దూసుకుపోతా ఉంది. ఈ రోజు వరుసగా మూడో రోజూ బంగారు ధరలో పెరుగుదల కొనసాగింది.  మంగళవారం  ట్రేడింగ్‌లో రూ.160 పెరిగి  రూ.30 వేలకు సమీపించింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.29,750 పలికింది.

బంగారు ధర దూసుకుపోతా ఉంది. ఈ రోజు వరుసగా మూడో రోజూ బంగారులో పెరుగుదల కొనసాగింది.  మంగళవారం  ట్రేడింగ్‌లో రూ.160 పెరిగి  రూ.30 వేలకు సమీపించింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.29,750 పలికింది.

 

స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం, అంతర్జాతీయంగా పరిణామాలు అనుకూలంగా ఉండటంతో బంగార మిల మిల మెరిసిపోతూఉందని బులియన్‌ వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. అటూవైపు వెండి కూడా బంగారుతో పోటీ పడనారంభించింది.  రూ.440 పెరిగడంతో మంగళవారం నాడు కిలో వెండి  రూ.40,840కి చేరింది. పరిశ్రమలనుంచి, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఉండటంతో వెండి ధరలో పెరుగుదల నమోదైందని వ్యాపార వర్గాలు చెప్పాయి.

 

అంతర్జాతీయంగా బంగారం ధర 0.75శాతం పెరగడం ద్వారా ఔన్సు 1,288.90 డాలర్లకు చేరింది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !