జగన్ పై ఎమ్మెల్యే రాచమల్లు అలక?

Published : Nov 13, 2017, 12:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
జగన్ పై ఎమ్మెల్యే రాచమల్లు అలక?

సారాంశం

ఏడోరోజుకి చేరుకున్న జగన్ పాదయాత్ర మైదుకూరులో పర్యటిస్తున్న జగన్ దిగ్విజయంగా సాగిన పొద్దుటూరు లో ప్రజా సంకల్పయాత్ర

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ఏడో రోజుకి చేరుకుంది. శని, ఆదివారాల్లో జగన్.. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పర్యటించారు. జగన్.. ప్రొద్దుటూరు పట్టణంలో ఎప్పుడైతే అడుగుపెట్టారో.. అప్పటి నుంచి జనాలే జనాలు. ఆయనపై పూల వర్షం కురిపించి.. పూల మీద నడిపించారు. ఎమ్మెల్యే రాచమల్లు  ప్రసాదరెడ్డి తన కెపాసిటీ అంతా చూపించి.. జగన్ ని ఫుల్ ఖుషీ చేశారు.

ప్రొద్దుటూరు పర్యటన దిగ్విజయం అయ్యిందని వైసీపీ శ్రేణులు ఒకవైపు సంబరపడిపోతుంటే... రాచమల్లు మాత్రం.. జగన్ పై అలకబూనారట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. శనివారం రాత్రి క్యాంపస్ వద్ద బస చేసిన జగన్.. ఆదివారం ఉదయం స్థానిక నేతలను కలవకుండానే పాదయాత్ర ప్రారంభించేశారు. కాగా.. జగన్.. తమ స్థానిక నేతలతో సమావేశం నిర్వహిస్తారని ఎమ్మెల్యే రాచమల్లు ఆశపడ్డారట. కానీ.. జగన్ అలా చేయకపోయేసరికి బాగా హర్ట్ కూడా అయ్యాడని సమాచారం. దీంతో పాదయాత్రకు కొంచెం దూరంగా ముభావంగా ఉండటంతో.. ఆయనకు ఎంపీ అవినాష్, కడప ఎమ్మెల్యే అంజాద్ నచ్చచెప్పారట. దీంతో.. రాచమల్లు శాంతించారని టాక్.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !