
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం తెలంగాణ బిడ్డ అమరావతికి వచ్చి మద్దతు పలకడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాక తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
మహిళా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అమరావతిలో నిర్వహించిన సదస్సులో ఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన ప్రసంగం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది.
తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హొదాకు మద్దతిస్తున్నట్లు ప్రకటించి అక్కడి వారి మనసులను కూడా ఆమె గెలుచుకున్నారు. అయితే ఈ సదస్సును దగ్గరుండి జరిపిస్తున్న అధికార టీడీపీ పార్టీకి ఆమె ప్రసంగం, దానికి వచ్చిన స్పందన చూసి మింగుడు పడలేదు.
ఇది చాలదన్నట్టు ఏపీకి ప్రత్యేక హోొదా కోసం మొదటి నుంచి గట్టిగా పట్టుబడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ రోజు కవితకు కృతజ్ఝతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో మద్దతు తెలిపిన ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు తీర్చడానికి సంఘీభావం చూపాలని, కలిసి పనిచేయాలని ఆమెను కోరారు. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే మనం పడిపోతాం.. జైహింద్ అని తన ట్వీట్ ను ముగించారు.
ఎన్నికల వేళ తమకు అన్ని విధాల అండగా ఉన్న జనసేనాని ఇలా సడెన్ గా తమ శత్రువులను పొగడ్తలతో ముంచెత్తడం తెలుగు తమ్ముళ్లకు దిమ్మతిరిగేలా చేస్తోంది. ముఖ్యంగా ఈ పొలిటికల్ గబ్బర్ సింగ్ తమకు ఏదో రోజు స్పాట్ పెట్టడం గ్యారెంటీ అని తెగ హైరానా పడుతున్నారు.