పవన్ ‘సేవా దళ్’ లో చేరాలంటే...!

First Published May 15, 2017, 1:56 PM IST
Highlights

ప్రసుత్తం పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసే అభ్యర్థుల కోసం పవన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల నేపథ్యం, వ్యక్తిగత వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకున్నాకే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

జనసేన పార్టీతో ఇప్పటికే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పవన్ కల్యాణ్... 2019 ఎన్నికలకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు.

 

ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలలో పర్యటించిన పవన్ అనంతపురం జిల్లా నుంచి పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు.

 

ఆ జిల్లా నుంచే పాదయాత్రకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. ఎన్ని అవాంతరాలెదురైనా అనంత నుంచే ఎన్నికల బరిలో దిగుతానని స్పష్టం చేశారు.

 

ప్రసుత్తం పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసే అభ్యర్థుల కోసం పవన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల నేపథ్యం, వ్యక్తిగత వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకున్నాకే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

 

ఇప్పటి వరకు కేవలం 150 మందికి మాత్రమే అధికారికంగా పవన్ పార్టీలో సభ్యత్వం దొరికిందటే అభ్యర్థుల వడబోత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

అయితే ఇప్పుడు పార్టీకి అనుబంధంగా మరో సంస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు జనసేనాని ప్రకటించారు.

 

ప్రజలకు సేవ చేయడానికి జనసేనకు అనుబంధంగా సేవాదళ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 అంశాలతో దీనికి నియమావళిని కూడా ప్రకటించారు. దీన్ని ప్రతి కార్యకర్త

పాటించాల్సి ఉంటుంది.

 

రానున్న రోజుల్లో దీన్ని మరింతగా విస్తృత పరిచేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

 

మొదట జిల్లా స్థాయిలో 100 మంది కార్యకర్తలతో కార్యక్రమాలు నిర్వహిస్తామని, తర్వాత మండల, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని పవన్ ప్రకటించారు.

click me!