చెప్పేదాకా ఎటిఎం లు తెరవద్దు: రిజర్వు బ్యాంక్ హెచ్చరిక

First Published May 15, 2017, 6:21 AM IST
Highlights

వాన్నా క్రై వైరస్‌ మరొక సారి దాడి చేసే ప్రమాదం ఉన్నందున విండోస్‌ అప్‌డేట్‌ వచ్చే వరకూ ఏటీఎం సెంటర్లను తెరవద్దని రిజర్వు బ్యాంకు దేశంలోని బ్యాంకులను ఆదేశించింది.

 

ప్రపంచాన్ని వణికిస్తున్న వాన్నా క్రై వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని విండోస్‌ అప్‌డేట్‌ వచ్చే వరకూ ఏటీఎం సెంటర్లను తెరవద్దని రిజర్వు బ్యాంకు దేశంలోని బ్యాంకులను ఆదేశించింది.

కంప్యూటర్‌లోకి ర్యాన్‌సమ్‌ వేర్‌ను చొప్పించి డేటాను చోరి చేసి బిట్‌ కాయిన్ల రూపంలో డాలర్లను వాన్నా క్రై డిమాండ్‌ చేస్తున్న ట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

 

మరొక సారి వాన్నా క్రై హ్యాకింగ్‌ దాడి జరగవచ్చనే వార్తలతో రావడంతో బ్యాంకులను అప్రమత్తమం చేసేందుకు రిజర్వు బ్యాంకు ఈ చర్యలు తీసుకుంది.

వాన్నా క్రై బాధితుల్లో ఎక్కువ మంది వినియోగించేది విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం. భారత్‌లో దాదాపు 90 శాతం మంది విండోస్‌ మీదే ఆధారపడుతున్నారు. మన దేశంలో ఉన్న 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం విండోస్ ఆపరేటింగ్‌ సిస్టంతో నడిచేవే.

 

దీంతో రక్షణ చర్యలు చేపట్టిన ఆర్‌బీఐ సెక్యూరిటీ అప్‌డేట్ వచ్చే వరకూ ఏటీఎంలను తెరవొద్దని ఆదేశాలు జారీ చేసింది. వాన్నా క్రై లక్ష్యం ఏటీఎంల నుంచి ప్రజల డబ్బును దొంగిలించడం కాదని.. నెట్‌వర్క్‌లలో సమాచారాన్ని లాక్‌ చేసి డబ్బును డిమాండ్‌ చేస్తుందని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు.

click me!