‘ఫన్నీ’రు బటర్ మాసాలా... !!

First Published Feb 6, 2017, 9:36 AM IST
Highlights

తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత  ఆ స్థాయిలో   నెటిజన్లు స్పందించింది పన్నీరు సెల్వం మీదే...

 

అభిమానం, ఆగ్రహం, వెటకారం ఈ మూడు కలిసి తమిళ తంబీలను దేశంలోనే ప్రత్యేకంగా నిలబెడుతోంది.

 

వారికి అభిమానం వచ్చినా... ఆగ్రహం వచ్చినా తట్టుకోవడం కాస్త కష్టమే. గుడి కట్టి పూజించగలరు. బతికుండగానే శ్రద్ధాంజలి ఘటించగలరు.

ఈ ‘అతి’తోనే వారకంటూ ఒక లాంటి గుర్తింపును కూడా తెచ్చుకున్నారు.

 

సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఎంతగా ఆరాధిస్తారో అతడిపై అదేస్థాయిలో జోకులు కూడా పేల్చి నవ్వుకోగలరు. ఇప్పుడు పన్నీరు సెల్వంపై కూడా అదే స్థాయిలో జోకులు పేల్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

 

నెట్ లో వైరల్ గా మారుతున్న  ‘ఫన్నీ’రు జోకులు కొన్ని చూడండి..

...........................................................................................................

పన్నీరు సెల్వం ఆర్టీసీ బస్సులో లేడీస్  సీటులో కూర్చొనే వ్యక్తి లాంటి వాడు...

లేడీస్ రాగానే తనే లేచి వారికి సీటు ఇస్తుంటాడు...

అంతేకాదా మరి... జయలలిత జైలుకెళ్లి వచ్చిన ప్రతిసారి పన్నీరు అలానే చేశారు. ఇప్పుడు శశికళ విషయంలోనూ అలానే చేశారు.

 

..........................................................................................

 

కొందరు పన్నీరు సీఎం పదవిని పిల్లల ఏగ్జామ్స్ తో పోల్చి జోకులు పేల్చారు. డిసెంబర్ లో పన్నీరు సీఎం అయ్యారు. ఆ సమయంలో స్కూల్ లకు హాఫ్ ఇయర్ ఏగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు శశికళ ఫిబ్రవరిలో సీఎం అవుతున్నారు. సాధారణంగా ఈ సమయంలో ఫైనల్ ఏగ్జామ్స్ మొదలవుతుంటాయి.

అందుకే

క్వాటర్లీ ఏగ్జామ్స్          -                              జయలలిత

హాఫ్ ఈయర్లీ ఏగ్జామ్స్  -                              పన్నీరు సెల్వం

ఫైనల్ ఏగ్జామ్స్           -                               శశికళ  

 

అంటూ సెటైర్ వేశారు.

 

..........................................................................................

 

అమ్మ క్యాంటీన్ లు, అమ్మ రేషన్ షాపులు, అమ్మ లాప్ టాపులు, అమ్మ వాటర్ బాటిళ్లు ఇలా తమిళనాట అంతా అమ్మ పథకాలే ఉన్నాయి.

అంతమాత్రాన  పన్నీరు నేవ్వేం బాధపడకు... పన్నీరు కర్రీ, పన్నీరు బటర్ మాసాల , పన్నీరు పాలక్ పకోడి ఇలా నీ పేరు మీద కూడా దేశం మొత్తంలో బోలెడు వెరైటీలున్నాయి. సో... బీ కూల్......అంటూ ఇంకోరు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు.

 

click me!