చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి బడ్జెట్ ధరలో రూ.8,490లకు అందరికి అందుబాటులో తెచ్చింది. దీన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ తదితర ఆన్ లైన్ స్టోర్లలో బుధవారం నుంచి మార్కెట్లో లభిస్తుంది.
భారత విపణిలోకి చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన ఒప్పో మరో సరి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘ఏ1కే’ పేరుతో బడ్జెట్ ధరలో మంగళవారం ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 6.1 అంగుళాల వాటర్ డ్రాప్ డిస్‌ప్లే, ఫేస్ అన్‌లాక్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉన్నది.
ఎంట్రీ లెవల్ ఫోన్ ‘ఏ1కే’
ఎంట్రీ లెవల్ ఫోన్‌గా ఈ ఏ1కే స్మార్ట్‌ఫోన్ ధరను రూ.8490గా ఖరారు చేసింది. ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్, టాటా క్లిక్, పేటీఎం మాల్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా రెడ్ అండ్ బ్లాక్ కలర్స్‌లో బుధవారం నుంచే లభ్యం కానున్నాయి.
undefined
2జీబీ రామ్‌తోపాటు 256 జీబీ వరకు విస్తరించే చాన్స్
6.1 అంగుళాల డిస్‌ప్లే గల ఒప్పో ‘ఏ1కే’, ఆండ్రాయిడ్ 9.0పై కలిగి ఉంటుంది. 1560 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తోపాటు 2 జీబీ ర్యామ్‌తోపాటు 32జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. దీన్ని 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం కల్పించింది.
4000 ఎంఎహెచ్ బ్యాటరీ కూడా గల ఒప్పో ‘ఏ1కే’
8 ఎంపీ రియర్ కెమెరా ప్లస్ 5ఎంపీ సెల్ఫీ కెమెరాతోపాటు 4000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. తొలుత రష్యా మార్కెట్లో నూతన ఏ1కే స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించిన ఒప్పో.. తదుపరి దశలో భారతదేశంలో ఆవిష్కరించలేదు.
ఈ నెలలో మార్కెట్లోకి ఒప్పో ‘ఎ5ఎస్’
ఇక ఒప్పో ‘ఏ1కే’ స్మార్ట్ ఫోన్ డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ కనెన్షన్లు, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ నెలలో ఒప్పో ఏ5ఎస్ ఫోన్ ఆవిష్కరించనున్నది.
టీసీఎస్‌పై మేధోసంపత్తి అపహరణ ఆరోపణలు
దేశీయ సాఫ్ట్‌వేర్ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ తమ సోర్స్ కోడ్ దొంగిలించిందని అమెరికా సంస్థ ఆరోపించింది. ఐదేళ్ల వ్యవధిలో వ్యాపార రహస్యాలను దొంగిలించిందనే అభియోగంపై దాఖలైన రెండో కేసు ఇది.
అమెరికాకు చెందిన కంప్యూటర్ సర్వీస్ కార్ప్ ఈ ఆరోపణలు చేసింది. బీమా రంగ సేవలు అందించే సాఫ్ట్‌వేర్ తయారీ కోసం అవాంఛనీయ విధానంలో సోర్స్‌కోడ్‌ను దొంగిలించిందని పేర్కొంది.
ట్రాన్స్ అమెరికాకు ‘బీమా’సేవల ప్లాట్ ఫామ్ ఇచ్చేందుకు టీసీఎస్ రెడీ
గతేడాది ట్రాన్స్ అమెరికాకు బీమారంగ సేవల ప్లాట్‌ఫారమ్ తయారు చేసి ఇచ్చేందుకు జనవరిలో టీసీఎస్ అంగీకరించింది. ఈ కాంట్రాక్టు విలువ రెండు బిలియన్ డాలర్లు. టీసీఎస్ చరిత్రలో ఇదే అతిపెద్ద కాంట్రాక్టు. ఈ క్రమంలో టీసీఎస్ అక్రమంగా తమ సోర్స్‌కోడ్‌ను వాడుకొందని సీఎస్‌సీ ఆరోపించింది.
తామే నిబంధనలను ఉల్లంఘించలేదన్న టీసీఎస్
దీనిపై టీసీఎస్ ప్రతినిధి మాట్లాడుతూ టీసీఎస్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదన్నారు. కోర్టులో తమ వాదనలు బలంగా వినిపిస్తామన్నారు. ఈ కేసుపై అమెరికాలోని టెక్సాస్ న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది.
టీసీఎస్‌పై 2014లో సీఎస్‌సీ ఆరోపణలు ఇలా
సీఎస్‌సీ తన వాన్టేజ్, సైబర్ లీఫ్ సాఫ్ట్‌వేర్లకు సంబంధించి ట్రాన్స్ అమెరికా అనుబంధ కంపెనీ అయిన మనీసర్వీస్ ఐఎన్‌సీకి లైసెన్స్ ఇచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్ కోడ్‌లనే టీసీఎస్ దుర్వినియోగం చేసిందని సీఎస్‌సీ చెబుతోంది. 2014లో అమెరికాకు చెందిన ఎపిక్ సిస్టమ్స్ టీసీఎస్‌పై ఇటువంటి ఆరోపణలే చేసింది.
టీసీఎస్ ఉద్యోగి తమ సమాచారం తస్కరించారని సీఎస్సీ ఆరోపణ
టీసీఎస్‌కు చెందిన ఉద్యోగి 6,000 పేజీల సమాచారాన్ని తస్కరించారని సీఎస్సీ పేర్కొన్నది. ఈ కేసులో చివరికి 420 మిలియన్ డాలర్లను ఎపిక్ సిస్టమ్స్‌కు చెల్లించాలని తీర్పు వెలువడింది. దీనిపై టీసీఎస్ ప్రస్తుతం అప్పీల్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది.
దశాబ్ది క్రితమే హువావేలో సెక్యూరిటీ లోపాలు గుర్తించిన వొడాఫోన్
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం ‘హువావే’చేపట్టిన స్మార్ట్ ఫోన్ల తయారీలో సెక్యూరిటీ లోపాలను దశాబ్ది క్రితమే బ్రిటన్ టెలికం సంస్థ వొడాఫోన్ గుర్తించింది. విదేశాల్లో 5జీ నెట్ వర్క్స్ అభివ్రుద్ధి చేయడంపై వొడాఫోన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటలీలో ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం అక్రమ మార్గాల్లో ఫిక్స్‌డ్ లైన్‌ను వాడుకున్నదని వొడాఫోన్ ఆరోపణ.