( వీడియో) దుబాయికి పెద్ద నోట్లను ఎలా తరలిస్తారంటే...

First Published Dec 29, 2016, 1:04 PM IST
Highlights

డబ్బులు చెట్టుకు కాస్తాయో లేవో తెలియదు కానీ, ముంబై ఏయిర్ పోర్టులో మాత్రం బట్టలకు కాశాయి. వాటిని లెక్కబెట్టలేక అక్కడి అధికారులు నానా హైరానా పడ్డారు.

 

అదిరేటి డ్రెస్ అమ్మాయిలేస్తే మగాడి గుండెల్లో దడ పుడుతుందో లేదో తెలియదు కానీ,  ఆ డ్రెస్సులు చూసి మాత్రం కస్టమ్స్ అధికారులకు దడ పుట్టింది.

 

డబ్బులు చెట్టుకు కాస్తాయో లేవో తెలియదు కానీ, ముంబై ఏయిర్ పోర్టులో మాత్రం బట్టలకు కాశాయి. వాటిని లెక్కబెట్టలేక అక్కడి అధికారులు నానా హైరానా పడ్డారు.

 

కళ్లున్నోడు ముందు మాత్రమే చూడగలడు.. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూడగలడు... కనిపించే వారిని కూడా కనికట్టు చేయగలడు. స్కానర్లను కూడా బోల్తా కొట్టించగలడు. అలాంటి ఘనుడు చేసిన ఓ పని కస్టమ్స్ అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా చేసింది.

 

ఆడవాళ్ల అందానికే వన్నెతెచ్చే ఆ అందమైన చుడీదార్లు, పంజాబీ డ్రెస్సులు ఈ ఘరానా ఘనుడు ఇలా ఉపయోగించుకుంటాడని వారికి మాత్రం ఏం తెలుసు.. ఇన్నాళ్లు సాఫీగా సాగుతున్న అతడి యవ్వారం ఇప్పుడు బయటపడింది. అనుకోకుండా అతడు దుబాయికి తరలిస్తున్న చుడిదార్లు, పంజాబీ డ్రెస్సులను చెక్ చేసిన అధికారులు వాటి తగుసీ బయటపడిన కరెన్సీ కట్టలను చూసి షాక్ అయ్యారు.

 

కావాలంటే ఈ వీడియో చూడండి.. తళతళలాడే కొత్త రూ.2 వేల నోట్లను అమ్మాయి డ్రెస్సలలో ఎంత పొందికగా దాచిపెట్టాడో.

 

 

 

ఆరీఫ్ కొయ్యింటే అనే వ్యక్తి భారత పాసుపోర్టుతో ముంబై ఏయిర్ పోర్టు వచ్చాడు. అక్కడ దుబాయి ప్లైట్ ఎక్కడానికి స్పైస్ జెట్ విమానం కోసం ఎదురు చూస్తున్నాడు. కస్టమ్స్ అధికారులు తమ విధిలో భాగంగా అతడి దుబాయికి పంపించే కంటైనర్ లను తెరిచి చూశారు. అందులో 13 కాటన్ డబ్బాల్లో చుడిదార్లు, పంజాబీ డ్రెస్సులున్నాయి.

 

డిజైన్ బాగుంది కదా వాటిలో ఒకటిని తీసిచూస్తే అసలు విషయం బయటపడింది. డ్రెస్సు లోపల తెల్లటి పేపర్లలలో చాలా పొందికగా అమర్చిన రూ. 2 వేల నోట్ల కట్టలు బయటపడ్డాయి. దీంతో అన్నింటిని కస్టమ్స్ అధికారులు తెరిచి చూశారు.


13 కాటన్ డబ్బాలలో ఉన్న అన్ని బట్టలను వెతికి చూడగా దాదాపు రూ. 25 లక్షలు బయటపడ్డాయి. అవన్నీ కూడా కొత్త రూ. 2 వేల నోట్లే కావడం గమనార్హం.

దీంతో అరీఫ్ ను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.

 

ఒక వైపు పెద్ద నోట్లు రద్దుతో దేశంలోని నల్లధనం అంతా నాశనమైపోతుంది అని సంబరపడుతుంటే.. విదేశాలకు అక్రమంగా కొత్త నోట్లు ఇలా తరలిస్తున్నారన్నమాట.

click me!