ఇదీ మన స్వచ్ఛభారత్... సిగ్గుపడండి

First Published Dec 29, 2016, 8:20 AM IST
Highlights

ఇది చదివితే ఎవరయినా సిగ్గు పడాల్సిందే...

హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో నివసించే వాళ్లకు వింత సమస్య ఎదురవుతున్నది.

 

ఉన్నట్లుండి ఆకాశం నుంచి మలమూత్రాలు వాళ్ల ఇళ్లమీద పడుతున్నాయి. చాలా కాలం  ఈ అసహ్యకరమయిన  వింత రహస్యం వారికి బోధపడలేదు.

 

 ఇవి ఎక్కడ నుంచి పడుతున్నాయని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది.

 

హైదరాబాద్ విమానాశ్రయంలో దిగే విమానాలు తమ టాయిలెట్‌ ట్యాంకులను ఆకాశంలోనే ఖాళీ చేస్తున్నాయట. అందువల్లే ఆ అశుభ్రం తమ ఇళ్ల మీద పడుతుందని గుర్తించారు.

 దేశమంతా స్వచ్‌ భారత్‌ స్మరణ చేస్తున్న వేళ విమాన సంస్థలు ఇంత నీచ నికృష్ట కార్యానికి పూనుకోవడం దిగ్ర్బాంతి కలిగిస్తోందని ఎయిర్‌ పోర్టు పరిసర ప్రాంతాల ప్రజలు అంటున్నారు.

 

విమాన సంస్థల  ఈ వికారపు చేష్ట గురించి రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్‌  సమీపంలో నివసిస్తున్న రిటైర్డు ఆర్మీ అధికారి లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ సత్వంత్‌ సింగ్‌ దహియా సాక్షాధారాలతో సహా నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌లో కేసు వేశారు.

 

దీనిని విచారించిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ బెంచ్‌ అధ్యక్షులు కుమార్‌ విమానయాన సంస్థలు ఇలా చేయడం దారుణమని పేర్కొంటూ, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ తగిన చర్యలు తీసుకొని విమానం ల్యాండ్‌ కాగానే ఆకస్మిక తనిఖీ చేసి టాయిలెట్‌ బాక్స్‌ ఖాళీగా ఉంటే దారిలోనే వాటిని ఖాళీ చేసిన విమానాలమీద 50,000 రూపాయల ఫైన్‌ వేయాలని తీర్పునిచ్చారు.

 

 

 

click me!