ఆ నోట్లను అప్పుడే రద్దు చేశారట...?

Published : Dec 29, 2016, 10:35 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఆ నోట్లను అప్పుడే రద్దు చేశారట...?

సారాంశం

పెద్దనోట్ల రద్దుపై సమాచారహక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆర్ బి ఐ ఈ వివరాలను వెల్లడించింది.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 8 న జాతినుద్దేశించి ప్రసంగిస్తూ పెద్ద నోట్లను తక్షణం రద్దు చేస్తున్నట్లు ప్రటించిన విషయం తెలిసిందే.

 

రద్దు ప్రకటన కేబినెట్ లో మంత్రులతో సహా ఎవరికీ తెలియదని ఆ తర్వాత వార్తలు వెలువడ్డాయి.

 

అయితే ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందే ఆర్ బీ ఐ  ఆ నోట్లను రద్దు చేసిందట.

 

 

ప్రధాని రాత్రి 8 గంటల తర్వాత జాతినుద్దేశించి మాట్లాడుతూ.. తక్షణం రూ.1000, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

 

దానికంటే ముందే అంటే సాయంత్రం 5.30 గంటలకే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు అధికారికంగా ఆమోదం తెలిపిందట.

 

 

సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి ఆర్ బి ఐ అధికారులను ఈ వివరాలు ఇవ్వాలని కోరగా దానికి ఆర్ బి ఐ సమాధానమిచ్చింది.

 

 

పెద్ద నోట్లు రద్దు ప్రకటనకు ముందు ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు. ఆర్. గాంధీ, ఎస్ఎస్ ముంద్రా, వీఎస్ విశ్వనాథన్లతో పాటు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ లు సమావేశమై ఈ విషయమంపై చర్చించారట.

 

అలా ప్రధాని ప్రకటనకు ముందే ఆర్ బి ఐ పెద్ద నోట్లను రద్దు చేసి ప్రధానికి తమ ఆమోదం తెలుపుతూ నోట్ కూడా పంపిందట.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !