(వీడియో) ఇస్రో ప్రయోగానికి నెల్లూరు ప్రజల శుభాకాంక్షలు

Published : Feb 13, 2017, 10:46 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
(వీడియో) ఇస్రో ప్రయోగానికి నెల్లూరు ప్రజల శుభాకాంక్షలు

సారాంశం

నెల్లూరులో వెల్లివిరిసిన ఆనందోత్సహాలు

ఇస్రో  నెలకొల్పబోతున్న  ప్రపంచ రికార్డు కోసం అందరికంటే ఎక్కువగా ఎదురుచూస్తున్నది నెల్లూరు జిల్లా ప్రజలే.

 

104 ఉపగ్రహాలను నింగిలోకి పంపే  అగ్రరాజ్యాలను మించిపోయే ప్రయోగం చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కు చెందిన శాస్త్రవేత్తలకు ముఖ్యంగా వారిఇంటి ముందే ఉన్న శ్రీహరి కోటు షార్ నిపుణులకు శుభాకాంక్షలు తెలుపుతూ జర్నలిస్టులు,విద్యార్థులు, ప్రజలు ఈ రోజు నెల్లూరు ర్యాలీ నిర్వహించారు. జయహో భారత్.. జయహో ఇస్రో  నినాదాలాతో నెల్లూరు వీధులు మారుమోగాయి.  ఈ నెల 15న ఏపీయుడబ్య్లూజే ఆద్వర్యంలో ఈ భారీ ర్యాలీ నిర్వహించారు.  నగరలోని పలు కళాశాలల  విద్యార్దులతో 1000 అడుగుల త్రివర్ణ పతాకం ప్రదర్శించారు. దానితో పాటూ PSLV C-37రాకెట్ నమూనాతో విఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు బ్రహ్మాండమయిన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్బంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు విఆర్సీ మైదానంలో ఇస్రో్ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు  తెలుపూ బెలూన్లు ఎగుర వేశారు. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ,‘ ఒకేప్రయోగంలో  104 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడం ఇదిమొదటి సారి. ఇలాంటి ప్రయోగం నిర్వహించే స్థాయికి ఇస్రో చేరుకోవడం భారతీయులుందరికి గర్వకారణం. ఆ రోజు అంతరిక్ష అగ్రరాజ్యాల మించి  భారత్  ఎదుగుతుంది,’  అని అన్నారు.

 

ఎన్నో అద్భుతాలు ఆవిష్కరిస్తున్న శ్రీహరి కోట ‘షార్’  జిల్లా ప్రజలకు గర్వకారణం అని ఆయన కొనియాడారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !