ఇక ‘ఆరే’యనున్న జియో

Published : Feb 13, 2017, 10:36 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఇక ‘ఆరే’యనున్న జియో

సారాంశం

6 సిరీస్ తో కొత్త నెంబర్లు జారీ చేసేందుకు నిర్ణయం

భారత టెలికాం ఇండస్ట్రీలో ఫ్రీ ఆఫర్ లతో పెను విప్లవం సృష్టించిన జియో ఇప్పుడు మరో రికార్డుతో ముందుకు వస్తోంది. ఇప్పటికే ఫ్రీ డేటా, వాయిస్ కాలింగ్ ఆఫర్లతో పోటీ టెలికాందారులను దారుణంగా దెబ్బకొట్టిన జియో ఇంకో కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది.

 

ఇప్పటివరకు 9 లేదా 8 లేదా 7 నెంబర్ల సిరీస్ తోనే ఫోన్ నెంబర్లు ఇండియాలో ఉన్నాయి. ఇప్పుడు జియో తాను జారీ చేసే కొత్త సిమ్ లకు 6 సిరీస్ ను జారీ చేయనుంది.ఇప్పటికే దీనికి సంబంధించి టెలికాం డిపార్ట్ మెంట్ నుంచి అనుమతి కూడా పొందింది.

 

అంటే ఇక ఆరు అంకెతో మొబైల్ నెంబర్లను జారీ చేసిన తొలి సంస్థ గా జియో మరో రికార్డును కూడా కొట్టేయనుందన్నమాట. కాగా, ఇప్పటికే ఆరు సిరీస్ తో  పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని రాష్ట్రాలలో సిమ్ లు కూడా జారీ చేసినట్లు జియో అధికారులు తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu