చూస్కో... సాంబ

First Published Feb 13, 2017, 10:03 AM IST
Highlights

తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నపవన్ కల్యాణ్ కు తెలుగు సరిగా రాదా... తెలుగులో ఆంధ్రాను, ఆంగ్లంలో తెలంగాణను అక్షరదోషాలు లేకుండా రాయలేడా...?  

జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మధ్యన ట్వీట్ స్టార్ గానే ఎక్కువగా కనిపిస్తున్నారు. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ట్వీటర్ వేదికగానే ఉద్యమాలను రగిలిస్తున్నారు. రాయడం లేటవొచ్చు కానీ, రాయడం మాత్రం పక్కా అనేలా రాజకీయాలపై ఆయన ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. అయితే ఏం రాశామన్నది కాదు... ఏలా రాశామన్నది కూడా ముఖ్యమే. ఎందుకంటే ఆయనో సెలబ్రెటీ...

 

లక్షలాదిమంది ట్విటర్ లో ఆయనను ఫాలో అవుతున్నారు. ఈ విషయం గబ్బర్ సింగ్ పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు.ఎందుకంటే ఆయన ట్వీట్ చేసిన ప్రతిసారీ అందులో పంటికింది రాయిలా అక్షర దోషాలు, అన్వయ దోషాలు కనిపిస్తూనే ఉన్నాయి.

 

ఆ మధ్యన  ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం ఆయన యువత లో స్ఫూర్తి నింపుతూ కొన్ని ట్వీట్లు చేశారు. అందులో ఆంధ్ర ను ఆంద్ర గా ట్వీటారు. అంతకు ముందు తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఇంగ్లీష్ లో  ట్వీట్ తూ  Telangana పదాన్ని కూడా తప్పుగానే రాశారు.

 

ఇటీవల అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంట్ సమావేశంలో తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీ కవిత ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

దీనిపై వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్ ట్విటర్ లో కవితకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే  ఆమె పేరును ప్రస్తావించినప్పడు పేరుకు ముందు శ్రీమతి అని సంభోధించాల్సింది, అది కాకుంటే మామూలుగా కవిత అని పేర్కొన్న బాగుండేది. కానీ, శ్రీ కవిత అని ట్వీటారు.  పురుషులకు మాత్రమే అలాంటి గౌరవవాచకాలు ఉపయోగిస్తుంటారు.

 

ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ ప్రతి ట్వీట్ లోనూ ఇలాంటి తప్పులు కుప్పలుగా దర్శనమిస్తూనే ఉన్నాయి.

 

వెండితెరపై పంచ్ డైలాగులు విసిరే కాటమరాయుడు రాజకీయ జీవితంలో కాస్తైనా ఇటువంటి వాటిపై దృష్టి పెడితే బాగుంటుందన్నది ఆయన అభిమానుల సూచన. అందుకే వారు ట్విటర్ లోనే ఈ విషయంపై పవన్ కల్యాణ్ కు సూచనలు కూడా చేస్తున్నారు.

click me!