7.30 కు టీవీ చూడండి

Published : Dec 31, 2016, 01:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
7.30 కు టీవీ చూడండి

సారాంశం

మరికాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

 

మేరే ప్యార్ దేశ్ వాసియో అంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ టీవీ ముందుకు వచ్చి మాట్లాడబోతున్నాడంటే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

 

ఆయన తీపి మాటల వెనుక ఎన్ని కఠిన నిర్ణయాలుంటాయోనని భయపడిపోతున్నారు సామాన్య జనం.

 

నవంబర్ 8 న రాత్రి టీవీలో ప్రసంగించడానికి వచ్చి ప్రధాని మోదీ ... మేరే ప్యార్ దేశ్ వాసియో అంటూ ఓ అణుబాంబు పెల్చారు.

ఆ బాంబు దాటికి దేశంలో క్యూల్లోలం మొదలైంది.


ప్రజలంతా ఏటీఎంల ముందు కుప్పకూలిపోయారు. బ్యాంకుల ముందు బారులుతీరారు. చేతిలో డబ్బున్నా ఖర్చు చేయలేని దుస్థితి తలెత్తింది.

 

క్యూలోనే మరణాలు.. క్యూలోనే జననాలు కూడా సంభవించాయంటే అతిశయోక్తి కాదు. అసలు దేశం మొత్తాన్ని క్యూ కట్టించిన గొప్ప ఘనతను ఆ ఒక్క మాటతో మోదీ చేశారు.

 

నల్లడబ్బు తెల్లగా మారిందో లేదో తెలయదు కానీ మోదీ మాటకు జనాలు మాత్రం తెల్లబోయారు. కొత్త నోటు కోసం పేదోడు ఏటీఎంల ముందు క్యూ కట్టాడు.. గొప్పోడు ఆర్ బి ఐ నుంచి కొత్త నోటును హోం డెలివరీ చేయించుకున్నాడు.

 

53 రోజులుగా సాగుతున్న ఈ క్యూల్లోలానికి ఎప్పుడు పులిస్టాప్ పడుతుందో ఇంకా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి 7.30 గంటలకు జాతి నుద్దేశించి మరోసారి ప్రధాని మోదీ... మేరే ప్యార్ దేశ్ వాసియో అనడానికి సిద్ధమవుతున్నారు.

 

కాబట్టి ప్రియమైన దేశ ప్రజలారా రాత్రి 7.30 కి టీవీలు ఆన్ చేయండి..

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !