
పెద్ద నోట్లు రద్దు చేస్తూ నవంబర్ 8 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే.
తన ప్రసంగంలో ప్రధాని ... మిత్రోం.. మిత్రోం.. ( మిత్రులారా) అని చాలా సార్లు అన్నారు. ఆ పదం ఢిల్లీలోని ఓ బారుకు బాగా కనెక్ట్ అయినట్లు ఉంది.
అందుకే ఈ సారి ప్రధాని మళ్లీ జాతినుద్దేశించి ప్రసంగించే వేళ తమ బారుకు వచ్చే వారికి రూ. 31 కే బీరును అందిస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ కు మిత్రోం ఆఫర్ అనే పేరు కూడా పెట్టింది.
మిగిలిన బార్లు కూడా ఇదే ఆఫర్ ను ఇప్పుడు ఫాలో అవుతున్నాయట. దీంతో ఈ మిత్రోం పదం ఇప్పుడు ఢిల్లీలో వైరల్ గా మారింది.
ఈ రోజు రాత్రి 7.30 కు జాతినుద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడనున్న నేపథ్యంలో ఆ బార్లు మందుబాబులకు కిక్కిరిసి పోవడం మాత్రం ఖాయం.