శ్రీమంతుడు కథ కాపీ కేసు: మహేష్ బాబు కోర్టుకు రావలసిందే

Published : Jun 12, 2017, 04:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
శ్రీమంతుడు కథ కాపీ కేసు: మహేష్ బాబు కోర్టుకు రావలసిందే

సారాంశం

‘శ్రీమంతుడు’ మహేష్ బాబు వ్యక్తిగా కోర్టుకు హాజరుకు కావలసిందే నని, ఈవిషయంలో ఈ చిత్ర హీరో కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేమని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది.శ్రీమంతుడు సినిమా ఒక నవలకు కాపీ అనే వ్యాజ్యం ఇపుడు కోర్టులో ఉంది. ఈ కేసుకు సంబంధించి  చిత్ర నిర్మాత ఎర్నేని నవీన్ కు కోర్టు సోమవారం సమన్లు జారీ చేస్తూ ఈ విషయం స్పష్టం చేసింది. 

‘శ్రీమంతుడు’ మహేష్ బాబు వ్యక్తిగా కోర్టుకు హాజరుకు కావలసిందే నని, ఈవిషయంలో ఈ చిత్ర హీరో కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేమని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది.శ్రీమంతుడు సినిమా ఒక నవలకు కాపీ అనే వ్యాజ్యం ఇపుడు కోర్టులో ఉంది. ఈ కేసుకు సంబంధించి  చిత్ర నిర్మాత ఎర్నేని నవీన్ కు కోర్టు సోమవారం సమన్లు జారీ చేస్తూ ఈ విషయం స్పష్టం చేసింది . ‘ఈ సినిమా హీరో విచారణకు హాజరు కావాల్సిందే. ఈ విషయంలో మినహాయింపు ఉండదు,’ అని కోర్టు చెప్పింది.

 

తాను 2012లో  స్వాతి మాస పత్రిక కోసం ‘చచ్చేంత ప్రేమ’ నవలఆధారంగా శ్రీమంతుడు సినిమా నిర్మించారని ఆర్‌.డి.విల్సన్‌ అలియాస్‌ శరత్‌చంద్ర అనే రచయిత కోర్టు లో కేసు వేశారు. తనకుతెలియకుండా తన నవలను కాపీ చేసి సినిమా తీయడం  కాపీ రైట్‌ చట్టం ఉల్లంఘని అవుతుందని ఆయన కోర్టును ఆశ్రయించారు.

 

దీనిపై విచారణ జరిపిన మొదటి అదనపు ఎంఎస్‌జే కోర్టు మహేశ్‌బాబు, కొరటాల శివలకు సమన్లు జారీ చేసింది.

 

తర్వాత వీరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, మహేశ్‌బాబు, కొరటాల శివలకు కింది కోర్టులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చింది.

 

ఇపుడు శ్రీమంతుడు నిర్మాత నవీన్ కు కూడా సమన్లను జారీ చేస్తూ  విచారణకు హీరో   మహేశ్ బాబు హాజరు కావాల్సిందేనని చెప్పింది.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !