'తెలంగాణా బిడ్డ' సినారె కు కెసిఆర్ నివాళి

First Published Jun 12, 2017, 1:59 PM IST
Highlights

అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్‌తో అందుకున్నారు. తెలంగాణ బిడ్డ కలం నుంచి వచ్చిన అనేక పద్య కావ్యాలున్నాయి. గేయ కావ్యాలు, వచన కవితలు, కథనాలు, బుర్రకథలు, గజళ్లు ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తాయి

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి మరణంపట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు  సంతాపం తెలిపారు. సినారె కుటుంబ స

 మీడియాతో మాట్లాడుతూ… భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్ధించాననని ముఖ్యమంత్రి అన్నారు. సాహిత్యరంగంలో సినారె చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిదని పేర్కొంటూ అధ్యాపకుడిగా, సాహితీవేత్తగా, కవిగా, సినీ గేయ రచయితగానే కాకుండా రాజ్యసభ సభ్యునిగా ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.

‘అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్‌తో అందుకున్నారు. తెలంగాణ బిడ్డ కలం నుంచి వచ్చిన అనేక పద్య కావ్యాలున్నాయి. గేయ కావ్యాలు, వచన కవితలు, కథనాలు, బుర్రకథలు, గజళ్లు ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తాయి,’ అని కెసిఆర్ చెప్పారు.

సినారె అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎస్ ఎస్‌పి సింగ్‌కు కెసిఆర్ ఆదేశించారు.

 

ప్రముఖ రచయిత, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) గారి మృతి తెలుగు సాహితీ  లోకానికి తీరని లోటు. తెలంగాణ మాగాణిలో విరిసిన విశిష్ట సాహితీ కుసుమం సినారే అని, వారి అస్తమయం తెలంగాణ తల్లికి తీరని గర్భశోకమని జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు తమ సంతాప సందేశంలో విచారం వ్యక్తం చేశారు. 

 

సినారె భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి, జానారెడ్డి, తెలుగు యూనివర్సిటీ విసి సత్యనారాయణ, సుద్దాల అశోక్ తేజ, నటుడు హరికృష్ణతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. 

 

click me!