కాంగ్రెస్ ను వీడేది లేదు, కోట్ల కుటుంబానికి కొన్నివిలువలున్నాయి

First Published Sep 17, 2017, 6:27 PM IST
Highlights

టిడిపిలో చేరతానని కొంతమంది దురద్దేశంతో ప్రచారం చేస్తున్నారు

తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను కేంద్ర మాజీ మంత్రి, కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి ఖండించారు. తన పై వస్తున్న ప్రచారం తిప్పికొట్టేందుకు ఆదివారం నాడు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ ను వదిలేసి ఆయన టిడిపిలో చేరతారనే ప్రచారం జరుగుతూ ఉంది.  దీనిని ఖండిస్తూ తాను తెలుగుదేశం  పార్టీ లోకి మరే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.  కొందరు కావాలనే తనపై ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

 2014 ఎన్నికలలో కర్నూలు ఎంపిగా ఓడిపోయిన తర్వాత  కర్నూలు జిల్లాలోని తన గ్రామానికే పరిమితమయ్యారు. అయితే, కాంగ్రెస్ కార్యకలాపాలలో మాత్రం పాల్గొంటున్నారు. గత కొద్దిరోజులుగా  ఆయన పార్టీ మారతారనే ప్రచారం మొదలయింది.  మొదట కోట్ల వైసిపిలోకి మారవచ్చనిచెప్పారు. ఇపుడు టిడిపిలోకివెళతాడని మీడియాలో వార్తలొస్తున్నాయి.

వీటిని తోసిపుచ్చుతూ తాను కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని, తన కుటుంబ సభ్యులు కూడా పార్టీ మారబోరని ప్రకటించారు. ఇలాంటి వార్తలు అపుడపుడూ ప్రచారమవుతూనే ఉన్నాయని చెబుతూ కోట్ల కుటుంబానికి కొన్ని విలువలు ఉన్నాయని.. వాటికి కట్టుబడి ఉంటానని అన్నారు. 2019లో టీడీపీ అధికారంలోకి రాదని కూడాఅన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమను బాగా నిర్లక్ష్యం చేశారని, ముఖ్యంగా  రైతుల ప్రయోజనాలను దెబ్బతీశారని ఆరోపిస్తూరాయలసీమ ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోతారని విమర్శించారు.  

 

మరిన్ని అసక్తికరమయిన వార్తలు ఇక్కడ చదవండి

click me!