
తన పుస్తకం ‘సామాజిక స్మగ్లర్లు’ సాకు చేసుకుని ఆర్యవైశ్యులనుంచి ఇతర రాజకీయ వర్గాల నుంచి వస్తున్న బెదిరింపులకు తాను భయపడనని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య స్పష్టం చేశారు. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పేరిట ఆయన రాసిన పుస్తకం తెలుగునాట బాగా సంచలనమయింది.పలురాజకీయ పార్టీలు, వైశ్యులు ఈ పుస్తకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. ఈ పుస్తకాన్నినిషేధించాలని, ప్రొఫెసర్ ఐలయ్య మీద చర్య తీసుకోవాలని ఆర్యవైశ్యు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆందోళనలు చేస్తున్నాయి . ఈ క్రమంలో వరంగల్ లో టీమాస్ ఆవిర్భావ సభలో ఐలయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో పెద్ద పారిశ్రామికవేత్తలంతా ఆర్యవైశ్యులే నని అన్నారు చెబుతూ తనపుస్తకంలోని వాదనని ఆయన సమర్థించుకున్నారు. కుల వివక్ష ఉన్నంత కాలం సమాజం అభివృద్ధి చెందదని ఆయన అన్నారు. యూనివర్శటీ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సమస్యలపై పోరాడుతానని ఆయన తెలిపారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అణగారిన వర్గాలు ఉద్యమించాలని ప్రొఫెసర్ ఐలయ్య పిలుపునిచ్చారు.