తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ బెస్ట్ స్పీచ్ ఇది

First Published Sep 17, 2017, 5:07 PM IST
Highlights

విద్య అంటే నారాయణ, విద్య అంటే శ్రీచైతన్య అనే దుర్గతి నుంచి బయటపడే మార్గం ఆలోచించండి

 

 

తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్రంలోని టీచర్లకు, తల్లితండ్రులకు, ఆపైన విద్యార్జులకు ఒక గొప్ప పిలుపిచ్చారు. ఆదివారం నాడు నాగోల్ లోని ఆనంతుల రాంరెడ్డి గార్డెన్ లో ఎస్టీయు టిఎస్ 70 ఏళ్ల ఉద్యమోత్సవం సభ లో ప్రసంగిస్తూ విద్యారంగంలో  పెడధోరణులకు కారణమయిన నారాయణ, శ్రీచైతన్యల వంటి కార్పొరేట్ సంస్థలను తరిమేయాలని పిలుపు నిచ్చారు. రాజేందర్  మంచి వక్త.  రెండురకాల ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చాడు. ఒకటి పిడిఎస్ యు అయితే రెండోది తెలంగాణ ఉద్యమం. ఉద్యమం నుంచి వచ్చిన మంచి వక్తలలో రాజేందర్ ఒకరు. ఇపుడు ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్ లో చక్కటి అవగాహన, ఆర్టిక్యులేషన్ వున్న మంత్రులలో రాజేందర్ పేరు  తప్పక చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజు నాగో ల్ లో  ఆయనచేసిన ప్రసంగం, ఇంతవరకు ఆయన చేసిన ప్రసంగాలన్నింటికంటే జబర్దస్తయిన ప్రసంగం.

విద్యఅంటే, నారాయణ, విద్య అంటే శ్రీచైతన్య అనే దుర్గతి నుంచి బయటపడే మార్గం ఆలోచించండి అని ఆయన తెలంగాణ టీచర్లను, తల్లితండ్రులను, విద్యార్థులను కోరారు.‘‘ఇప్పుడు విద్య అంటేనే మార్కులు అని, విద్య అంటే జాబ్స్ అని , విద్య అంటే శ్రీచైతన్య అని, విద్య అంటే నారాయణ అనుకోవల్సి వచ్చింది. ఈ దోరని విద్యను నిజ జీవితానికి దూరం చేస్తుంది ఈ సమాజం. విద్యను కార్పొరేట్ కబంధ హస్తలనుండి బయటకి తీసుకు వచ్చి పాత విధానం లో విద్యను బోధించేందుకు టీచర్స్ బాటలు వేయాలి,’’ అని  రాజేందర్ అన్నారు.

‘‘ఈ రోజు ప్రతి ఒక్కరు టెన్షన్  పడుతున్నారు.సమాజం లో రోజు రోజుకి ఈ టెన్షన్ పెరుగుతుంది. మీ శక్తిని ధార పోసి విద్యార్థులను తయారు చేస్తుంటే, సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూసి భయం వేస్తోంది. వీటిని చూస్తుంటే సమాజం ఎటు పోతుంది అనిపిస్తుంది.’’ అని తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల ఆందోళన వ్యక్తం చేచేవారు.

 ఇప్పుడు అసలే ఉద్యోగాలు దొరక్క చస్తుంటే, మరో పక్క ఉన్న ఉద్యోగం ఏ క్షణాన పోతుందో అనే భయం వెంటాడుతోందని ఆయన చెప్పారు. . ఇవ్వాళ గ్రామాల్లో ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే, చదువంతా లేక ఊళ్ళో నే ఉన్న కొడుకు సుఖంగా ఉంటే, చదువుకున్న కొడుకు ఇబ్బందులు పడుతున్నారనే భయ భావన తల్లితండ్రులలో పెరుగుతుండటం విచారకరమని అన్నారు.

ఈటెల ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు:

**ఇప్పుడు చదువు డాక్టర్స్, ఇంజనీర్లు కొంత మంది తయారవున్నారు. కానీ చాలా మంది ఏమీ కాకుండా రోడ్ మీద పడుతున్నారు.

**ఇప్పుడు చదువుకు విద్యార్థుల ప్రవర్తనకు గాప్ ఉంది.

**గతంలో విద్య మనలను గొప్ప మనుషులుగా తీర్చిదిద్దింది.

**ఇపుడున్న విద్య వల్ల మానవ శక్తి అంతా నిర్వీర్యం అవుతుంటే  శాస్త్ర విజ్ఞానం మానవ వనరలును నిర్వీర్యం చేస్తున్నది.

**రోబో లో అన్ని పనులు చేసినప్పుడు, 120 కోట్ల జనాభా ఉన్న మనదేశం పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.

**నాదేశం మానవ వనరల సంపద ఉన్న దేశం అని ప్రధాన మంత్రి ప్రపంచ మొత్తం చెప్పి వస్తున్నాడు, కానీ ఆ సంపదను ఉపయోగించుకోవడం లో గ్యాప్ ఉంది.

** చదువు బ్రతుకు నేర్పించాలి, లేదంటే చదువుమీద విముఖత వస్తుంది.

** అలాంటి బ్రతికించే చదువుకు మీ టీచర్స్ రూపకల్పన చెయ్యాలి.

**చదువు లో చరిత్ర ఎందుకు అన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ చరిత్ర నేర్పించక పోవడం వల్లనే సమాజం ఇలా తయారయ్యింది.

** అభివృద్ధి అంటే భవనాలు, సౌకర్యాలు కాదు.. మానవ విలువలు పెరగడం.

**గురివుకు శిష్యుడికి మధ్య ఉన్న సంబంధాలు తెగిపోయాయి. వాటిని పునరుద్ధరించాలి.

**సమాజం అంటేనే డబ్బు అనే భావన పోవాలి.

**పెరగాల్సినవి పోలీస్ స్టేషన్స్ కాదు విద్యాలయాలు.

**టీచర్స్ గా పి ఆర్ సి  కోసమే కాదు, సమాజాన్ని సరియైన దిశలో పెట్టేందుకు కూడా ఉద్యమించండి.

 

 

మరిన్ని అసక్తికరమయిన వార్తలు ఇక్కడ చదవండి

 

 

click me!