తెలంగాణ శ్రీనివాస్ భూమి కోసం మాడిపోయాడు

Published : Sep 24, 2017, 04:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
తెలంగాణ శ్రీనివాస్ భూమి కోసం మాడిపోయాడు

సారాంశం

హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరిలో  మాహంకాళి శ్రీనివాస్ ఒకరు.

 

దళితుడినయిన తనకు భూమి కేటాయించనుందుకు నిరసనగా ఈనెల 3 న నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన మహంకాళి శ్రీనివాస్ హైదరాబాద్ ఆసుపత్రిలో మరణించాడు. దళితులకు భూ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని ఈ నెల 3న గూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. ఇరవై రెండు రోజులుగా మృత్యువుతో పోరాడిన శ్రీనివాస్‌ ఆదివారం మధ్యాహ్నం తనువుచాలించాడు. శ్రీనివాస్ మృతితో బెజ్జంకి మండలం గూడెంలో విషాదం నెలకొంది. ఈ ఘటనతో టిఆర్ ఎస్ ఎమ్మెల్యే రసమయి ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !