జగన్ ఎఫెక్ట్ ?...నేటి నుంచి 50 వేల బెల్ట్ షాపులు బంద్

First Published Jul 19, 2017, 2:32 PM IST
Highlights

 నేటి నుంచి ఆంధ్రలో బెల్ట్ షాపులు బంద్

గ్రామాలలో మందు పారించిన  50 వేల బెల్ట్ షాపులు

వైన్ షాపులకు దేవుళ్ల పేర్లు నిషేధం

జగన్ మద్య నిషేధం  హామీకి చంద్రబాబు కౌంటర్ ?

ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి బెల్ట్ షాఫులు బందవుతున్నాయి. 50 వేల  బెల్ట్ షాపులను బంద్ చేసేందుకు  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం వెల్లడిస్తూ  రాష్ట్రంలో బెల్ట్ షాపులుంటే ఎక్సైజ్‌, పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ పేర్కొన్నారు. ఈ షాపులు మూసేసే విషయం ఎలా అమలుచేయాలో ఈ రోజు ఆయ ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారురాష్ట్రవ్యాప్తంగా 50వేలకుపైగా ఉన్న బెల్ట్‌ షాపులు తొలగించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడైనా బెల్ట్‌ షాపులుంటే తనకు నేరుగా సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.

అంతేకాదు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన  క్యాబినెట్ సమావేశంలో ఏమి నిర్ణయించారో చూడండి.

•  ఈ రోజు నుంచి బెల్టు షాపు అన్నది రాష్ట్రంలో కనబడకూడదని మంత్రిమండలి ఎక్సైజ్ శాఖ కార్యదర్శిని, కమిషనర్‌ను క్యాబినెట్  ఆదేశించింది.

•  వైన్ షాపులకు దేవుళ్ల పేర్లు ఉండకూడదు.

•  షాపుల బయట కూర్చుని తాగడానికి వీలు లేదు.

•  బెల్టు షాపులకు సప్లయ్ చేసే మెయిన్ షాపుల లైసెన్స్ రద్దు చేయాలి.

•  బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారికి 6 నెలల జైలుశిక్ష

•  బెల్టు షాపుల నిరోధానికి పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి చర్యలు ముమ్మరం చేయాలి.

 

ఎందుకింత యుద్ధ ప్రాతిపదికన  ఈ బెల్ట్ షాపుల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యుద్ధం ప్రటించారు.మూడేళ్లుగా ఆయనకు ఇలాంటిఆలోచన ఎందుకు రాలేదు.దీనికి కారణం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో చేసిన ప్రకటేనా?

 

వైజాగ్ వైసిపి ప్లీనరీ సమావేశలలో జగన్ ఒక సంక్షేమ అజండా ప్రకటించారు. అందులో ప్రధానమయినది మధ్య పాన నిషేధం. 2019లో పవర్ లోకి రాగానే దశలవారీగా మద్యపాన నిషేధం అమలుచేస్తానని ప్రటించారు. జగన్ పావులను జాగ్రత్తగా గమనిస్తున్న ముఖ్యమంత్రి ముందే ఈ కార్యక్రమం మొదలు పెట్టినట్లున్నారు.  మొత్తం నిషేధం విధించడం  చంద్రబాబు పాలసీకి వ్యతిరేకం, ఆయన రివర్ సైడ్ రెస్టరెంట్లు,విలాసవంతమయిన నైట్ లైఫ్ బహిరంగంగా కోరుకునేముఖ్యమంత్రి. అందువల్ల కొద్ది బెల్ట్ షాపుల మీద పడ్డారు. తాను కూడా ఆందోళనచేస్తున్న మహిళ  పక్షమే అని ఇలా చెప్పాలనుకున్నారా?

 

 

 

click me!