విజయవాడ మెట్రోకు ఎదురుదెబ్బ

Published : Jul 19, 2017, 01:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
విజయవాడ మెట్రోకు ఎదురుదెబ్బ

సారాంశం

విజయవాడ మెట్రో పై నీలినీడలు హైకోర్టును ఆశ్రయించిన బాధితులు మెట్రో భూసేకరణపై హైకోర్టు స్టే  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ కు ఆదిలోనే ఆటంకాలు మొదలయ్యాయి.దీనికోసం అమరావతి మెట్రో రైల్ కార్పోరేషన్ చేపడుతున్న భూసేకరణపై   ఉమ్మడి హై కోర్టు స్టే విధించింది.విజయవాడ పరిసరాల్లో  చేపడుతున్న భూసేకరణను వెంటనే ఆపేయాలని జస్టిస్ శివశంకర్ రావ్ తీర్పును వెలువరించారు.  
భూసేకరణపై స్థానికులు తమ అభ్యంతరాలను ప్రభుత్వ, మెట్రో అధారిటి పట్టించుకోవడం లేదని  కోర్టును ఆశ్రయించారు. భూసేకరణ కోసం జనవరి 2015లో జారీ చేసిన జీవో ఆహార భద్రత, సామాజిక భద్రతకు భంగం కలిగించేలా ఉందని వారు కోర్టుకు తెలిపారు. వీరి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం  తదుపరి విచారణ చేపట్టేవరకు  భూసేకరణపై స్టే విదిస్తున్నట్లు తెలిపింది.
4,000 వేల కోట్ల భారీ వ్యయంతో  అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టను చేపడుతోంది.ఈ సంవత్సరం చివర్లో రెండు కారిడార్లలో  పనులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  తాజాగా హై కోర్టు  భూసేకరణపై స్టే విధించడంతో మెట్రో ప్రాజెక్టు పనులు అనుకున్న సమయానికి మొదలవడం అనుమానంగానే కనబడుతున్నాయని ప్రభుత్వం తెలిపింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !