
బంగారానికి మహిళలకున్న బంధం విడదీయరానిది. పండగలు, పెళ్లిళ్లు.. శుభకార్యాలు.. సందర్భమేదైనా బంగారు ఆభరణాలతో
అలంకరించుకొని మురిసిపోతుంటారు. ఎంత అందంగా ముస్తాబైనా చేతికి గాజులు లేకపోతే ఏమి బాగుంటుంది చెప్పండి.. అందుకే
బంగారు ఆభరణాల్లో గాజులది ప్రత్యేక స్థానం. అందుకే కాబోలు బంగారు ఆభరణాల కొనుగోల్లో గాజులు అగ్రస్థానంలో నిలిచాయి.
మీరు చదివింది నిజమే మన దేశంలో బంగారు ఆభరణాల్లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నది గాజులనేనట. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చేసిన
సర్వేలో ఈ విషయాలు వెలువడ్డాయి. ఒక సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలలో 30నుంచి 40 శాతం
గాజులు ఉన్నాయి. ఒక్కో గాజు 8 నుంచి 25గ్రాముల బరువు ఉన్నవి కొనుగోలు చేస్తున్నారు. చైన్స్ కూడా ఒక సంవత్సరాల కాలంలో
30నుంచి 40 శాతం కోనుగోలు జరుగుతోందట. ఇవి 10 నుంచి 50గ్రాముల వరకు కొంటున్నారు.ఆ తర్వాతి స్థానంలో నెక్ లెస్ (15నుంచి20
శాతం), చెవి దిద్దులు (5 నుంచి 15శాతం), ఉంగరాలు (5 నుంచి 15శాతం) కొనుగోలు చేస్తున్నారు.