బీజేపీలోకి రజనీకాంత్.. వారంలో మోదీతో భేటీ!

First Published May 21, 2017, 5:17 PM IST
Highlights

ఈ వారంలోనే రజనీకాంత్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కాబోతున్నారని,  ఆ తర్వా త బీజేపీలోకి ఆయన  చేరుతారనే  వెల్లడించింది.

తమిళనాట రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై హాట్ హాట్ గా చర్చనడుస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా పార్టీ పెట్టి తనదైన స్టైల్ లో తళైవా పాలిట్రిక్స్ ప్లే చేస్తారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

 

Latest Videos

ఇన్నాళ్లు తన రాజకీయ రంగ ప్రవేశంపై సస్పెన్స్ మెయిన్ టేయిన్ చేసిన రజనీ ఇటీవల తన ఫ్యాన్స్ తీ మీటింగ్ సమయంలో మాత్రం కాస్త క్లారిటీ ఇచ్చారు. ప్రధాన స్రవంతి రాజకీయాల్లో అడుగుపెడతానని పరోక్షంగా బలమైన సంకేతాలు ఇచ్చారు.

 

దీంతో ఆయన అభిమానులు తమిళనాట హల్ చల్ చేస్తున్నారు. రజినీ పేదోళ్ల సీఎం అంటూ అప్పుడే బ్యానర్లు కూడా కడుతున్నారు.

 

అయితే రజనీ కొత్తగా పార్టీ పెట్టకుండా బీజేపీలో చేరుతారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో పేర్కొనడం గమనార్హం.

 

ఈ వారంలోనే రజనీకాంత్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కాబోతున్నారని,  ఆ తర్వా త బీజేపీలోకి ఆయన  చేరుతారనే  వెల్లడించింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... ‘బీజేపీ నిన్న రజనీతో మాట్లాడింది. ఈ వారంలోగా ప్రధాని మోదీతో భేటీ ఏర్పాటు చేస్తామని ఆయనకు తెలిపింది. ఈ భేటీ వివరాలు ఇంకా

ఫైనలైజ్‌ కావాల్సి ఉంది’ అని తన కథనంలో ఉటంకించింది.

http://indianexpress.com/article/india/next-rajinikanth-move-could-be-meeting-with-pm-modi-bjp-4666046/

click me!