అదిరిందయ్యా చంద్రం .. బాబుకు తమిళ పత్రిక ప్రశంసలు

Published : May 21, 2017, 02:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
అదిరిందయ్యా చంద్రం .. బాబుకు తమిళ పత్రిక ప్రశంసలు

సారాంశం

సీఎం అంటే ఇలానే ఉండాలంటూ ఆ తమిళ వార పత్రిక చంద్రబాబును ఆకాశానికి ఎత్తింది.

అప్పుడెప్పుడో ఒకే ఒక్కడు సినిమా సందర్భంగా తమిళ దర్శకుడు శంకర్ నాటి ఏపీ సీఎం చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తాడు. చాలా మందికి ఆ విషయం గుర్తుందో లేదో... ఇప్పుడు ఆయన బాటలోనే మరో తమిళ మీడియా చంద్రబాబను ఆకాశానికి ఎత్తింది.

 

సాధారణంగా అరవోళ్లు ఇతరులను పొగడరు. కానీ, విభజన తర్వాత ఏపీని అభివృద్ది బాట పట్టించడంలో

 

చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారని భావించిన ఓ తమిళ పత్రిక ఆయనపై ప్రశంసల వర్షం కురిపించింది.

ఇప్పిడిదాన్ ఇరుక్కవేండ్రుం ముదల్వరె పుదియ తలైమురై అనే తమిళ వార పత్రిక బాబు ముఖచిత్రంతో ఏకంగా నాలుగు పేజీల కథనాన్ని ప్రచురించింది.

 

 ఈ కథనంలో ఏపీ అభివృద్ధి, చంద్రబాబు నాయుడు పనితీరు తో పాటు ఆయన వల్ల తమిళనాడు నుంచి పరిశ్రమలు ఏపీకి ఎలా తరలివెళ్తున్నాయో పూసగుచ్చినట్లు వివరించింది.

 

నవ్యాంధ్రను చంద్రబాబు పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చుతున్నారని ఆకాశానికి ఎత్తింది.

 

బాబు పనితనం గుర్తించే తమిళనాడులో పెట్టాలనుకున్న తమ ప్లాంట్ ను జపాన్ కు చెందిన ఇసుజు కంపెనీ శ్రీ సిటీకి తరలించిందని పేర్కొంది.

బాబు మీద నమ్మకంతోనే 2400 కోట్ల పెట్టుబడితో తమిళనాడులో హీరో మోటార్ క్రాప్ స్థాపించాలనుకున్న టూ వీలర్ ప్లాంట్ ను కూడా ఏపీ లోని చిత్తూరు జిల్లాకు తరలించారని తెలిపింది.

 

సాంకేతికతను వాడుకోవడంలోనూ, సవాళ్లను ఎదురుకోవడంలోనూ బాబు తర్వాతే ఎవరైనా అంటూ పొగిడేసింది.

 

తమిళనేతలు ఆయనను చూసి రాష్ట్రాన్ని ఏలా పాలించాలో తెలుసుకోవాలంటూ చురకలు కూడా అంటించింది.

 

గతంలో ఒకే ఒక్కడు సినిమా సందర్భంగా ఆ సినిమా దర్శకుడు శంకర్ కూడా చంద్రబాబు పనితీరును స్ఫూర్తిగా తీసుకొనే తాను ఆ సినిమా తీసినట్లు పేర్కొనడం తెలిసిందే.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !