అప్పుడు ఇందిరా గాంధీ.. ఇప్పుడు నిర్మలా సీతారామన్

First Published 3, Sep 2017, 6:04 PM IST
Highlights
  • ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మలా సీతారామన్‌కు ఎవరూ వూహించని విధంగా అత్యంత కీలక శాఖ అయిన రక్షణ శాఖ బాధ్యతల్ని మోదీ అప్పగించారు
  • ఆమె భర్త తరపు కుటంబం కాంగ్రెస్ పార్టీ తరపు వారైనప్పటికీ.. ఆమె రాజీకీయ అడుగులు మాత్రం బీజేపీ వైపే వేశారు.

కేంద్ర మంత్రివర్గం పునర్‌ వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో కొత్తగా కేబినెట్‌లోకి తీసుకున్న పలువురు మంత్రులకు శాఖలు కేటాయించారు. కేంద్ర కేబినెట్‌ మంత్రులుగా పదోన్నతి పొందిన నలుగురితో పాటు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న తొమ్మిది మందికి శాఖలు అప్పగించారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మలా సీతారామన్‌కు ఎవరూ వూహించని విధంగా అత్యంత కీలక శాఖ అయిన రక్షణ శాఖ బాధ్యతల్ని మోదీ అప్పగించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రక్షణ బాధ్యతలు చేపట్టనున్న రెండో మహిళ నిర్మలా సీతారామన్‌ కావడం విశేషం. అయితే, పూర్తి స్థాయి రక్షణ మంత్రి శాఖ బాధ్యతలను చేపడుతున్న తొలి మహిళ మాత్రం సీతారామనే కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు..

నిర్మలా సీతా రామన్ 1959 ఆగస్టు 18వ తేదీన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు.  మద్య తగరతి కుటుంబంలో జన్మించిన ఆమె న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు.

ఆమె మొదట ప్రెస్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్ గా పని చేశారు. 2003-2005 మధ్య కాలంలో సీతా రామన్.. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా పని చేశారు. ఆమె భర్త తరపు కుటంబం కాంగ్రెస్ పార్టీ తరపు వారైనప్పటికీ.. ఆమె రాజీకీయ అడుగులు మాత్రం బీజేపీ వైపే వేశారు.

నిర్మలా.. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్న సమయంలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ విధానం అమలులోకి వచ్చింది. అదే ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో చేరాల్సిందిగా ఆమెక పార్టీ నుంచి పిలుపు వచ్చింది.ఆ పిలుపు మేరకు ఆమె అందులో చేరారు. తరువాత 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు ఆమె స్వీకరించారు. అనంతరం రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఆరుగురు బీజేపీ అధికార ప్రతినిధి బృందంలో ఆమె చోటు దక్కించుకున్నారు.

2014 ఎన్నికల్లో బీజేపీ అధిక మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఆమె ప్రత్యక్షంగా, పరోక్షంగా పోటీ చేయనప్పటికీ.. మోదీ ప్రభుత్వం ఆమెకు కేంద్ర మంత్రి పదవిని అప్పగించారు. ఒక దశలో ఆమెను క్యాబినెట్ నుంచి తొలగించి పార్టీ బాధ్యతలప్పగిస్తారని కూడా వూహాగానాలువచ్చాయి. చడీచప్పుడు లేకుండా,ఎలాంటి వివాదం లేకుండా పని చేసుకుపోయే తత్వం ఆమెది.కాగా.. ఇప్పుడు పదోన్నతి పొంది అత్యుత్తమ పదవిని సొంతం చేసుకున్నారు.

Last Updated 26, Mar 2018, 12:01 AM IST