మరోసారి మీడియా కన్నుగప్పిన మోదీ

First Published Sep 3, 2017, 5:03 PM IST
Highlights
  •  ప్రభుత్వం ఏదైనా కార్యరూపం దాల్చబోతోంది అనుకుంటే.. వెంటనే మీడియాకు తెలిసి పోతుంది.
  • మోదీ ప్రభుత్వంలో మాత్రం అలాంటివి జరిగే ఛాన్స్ లేదు.

ప్రధాని నరేంద్రమోదీ.. ఏదైనా చర్యలు తీసుకుంటున్నారు అంటే.. కనీసం తన పార్టీ నేతలకు కూడా తెలియనివ్వరు. చాలా సీక్రెట్ గా పని చేయిస్తాడు. దాదాపు  ప్రభుత్వం ఏదైనా కార్యరూపం దాల్చబోతోంది అనుకుంటే.. వెంటనే మీడియాకు తెలిసి పోతుంది. కానీ మోదీ ప్రభుత్వంలో మాత్రం అలాంటివి జరిగే ఛాన్స్ లేదు.మొన్నటికి మొన్న పెద్ద నోట్ల రద్దీ విషయంలోనూ అంతే.. ఆయన ప్రకటించే వరకు ఎవరికీ ఆ విషయం గురించి తెలీదు. ఇప్పుడు.. కేంద్ర మంత్రి వర్గ విస్తరణలోనూ అదే జరిగింది.

ఆదివారం కేంద్ర మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. 9మంది కొత్తవారికి మంత్రి వర్గంలో చోటు కల్పించిన విషయం తెలిసిందే. కాగా.. మంత్రి వర్గ వస్తరణ చేపడుతున్నారనే విషయం తెలియగానే.,. ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందో మీడియా ఊహించుకుంది. అయితే మీడియా ఊహకు అందని వారిని మంత్రులను చేసిన మోదీ ప్రభుత్వం.

బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి విషయాన్ని వెంటనే మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడుతోంది. ముఖ్యంగా పార్టీ అగ్రనేతలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నారు,

ఇదే విషయాన్ని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలియజేశారు. తమ ప్రభుత్వం గానీ, పార్టీ గానీ ప్రతీ విషయాన్ని మీడియాతో చర్చించదు.. తమకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయంటూ తేల్చిచెప్పారు.

అంతెందుకు.. రాష్ట్రపతి అభ్యర్థి గా రామ్ నాథ్ కోవింద్ ని తాము ప్రతిపాదిస్తునానమని బీజేపీ ప్రకటించే వరకు కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు. ఏ జాతియ మీడియా కూడా గెస్ చేయలేకపోయింది.

మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన క్షణం ఆయనకు సంబంధించిన ప్రతి విషయం కేవలం దూరదర్శన్ ఛానెల్ కి తప్ప మరే ఇతర ఛానెళ్లకు తెలియనివ్వలేదు. ఆఖరికి ఆయన విదేశీ పర్యటనల గురించి కూడా వెంటనే తెలియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాడు. దీనికి బీజేపీ జాతియ     అధ్యక్షుడు అమిత్ ష  ప్రోత్సాహం చాలా ఉంది.

 

click me!