
ఆసియాలో చాలా తక్కువ మందికి వచ్చే జన్యు లోపానికి ఇండియన్ శాస్త్రవేత్తలు కారణాలను కనుగొన్నారు. ఇండియాలో ఎక్కువగా వైశ్యులకు వచ్చే ఈ జన్యు లోపానికి సీసీఎంబీ శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొన్నారు.
బ్యూటిరైల్‌కోలీనీస్టేరేజ్ అనే ఎంజైమ్ లోపంతో ఇప్పటికే చాలా మంది మరణించారు. ఈ ఎంజైమ్ లోపం కల్గిన వారికి శస్త్ర చికిత్సలు జరుగుతున్నప్పుడు మత్తు మందు పనిచేయ్యకపోడంతో ఆపరేషన్ థియోటర్‌లోనే మరణించడం జరుగుతుంది. ఈ ఎంజైమ్ సాధారణ వైద్యానికి కూడా మరణించే అవకాశం ఉంది భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వివాహాలు కల్గిన వారిలో ఈ బ్యూటిరైల్‌కోలీనీస్టేరేజ్ లోపం కల్గుతుంది.
వారిలో వారు వివాహాలు చేసుకునే సంప్రదాయం మన ఇండియాలో వైశ్యులలో అధికంగా ఉంటుంది. ప్రతి ముగ్గురి వైశ్యులలో ఒక్కరికి బ్యూటిరైల్‌కోలీనీస్టేరేజ్ ఎంజేమ్ లోపం కల్గి ఉంటుందని అంచనా. విజయవాడ, విశాఖపట్నం నగరాలలో వైశ్యుల నుండి సేకరించిన నమూనాలను పరిక్షించి, కారణాలను కనుగొన్నారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు గత రెండు సంవత్సరాలుగా బ్యూటిరైల్‌కోలీనీస్టేరేజ్ ఎంజేమ్ లోపాన్ని అధిగమించడానికి కృషి చేశారు. సీసీఎంబీ శాస్త్రవేత్త అయినా డాక్టర్ తుంగరాజ్ మాట్లాడుతు కుటుంబంలో వివాహాలను అరికట్టితే చాలు ఈ ఎంజైమ్ లోపం నుండి బయటపడొచ్చని తెలిపారు. ఒకవేళ పెళ్లీ చేసుకున్న తరువాత గర్భస్థ దశలో కూడా ఈ లోపాన్ని తగ్గించవచ్చు అని తెలిపారు.
మన శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా ప్రపంచంలో ఉన్న 150 కోట్ల మందికి పైగా ఉపయోగకరమని అంతర్జాతీయ పత్రిక ప్రకటించింది.