నిషిత్ వేళ గాని వేళ వోవర్ స్పీడ్ కు బలయ్యాడా?

First Published May 10, 2017, 2:32 AM IST
Highlights

మంత్రి నారాయణ కుమారుడు నితిష్ కూడా చాలా  మంది విఐపిల  సంతానం లాగే   వోవర్  స్పీడ్ కి బలయ్యాడు.
వోవర్ స్పీడ్ కు కారణాలు ఏమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం  లేదు. వీళ్ల ప్రయాణాలు రాత్రి పొద్దుపోయాక, అనుమానాలకు తావిచ్చే సమాయాల్లో సాగుతుంటాయి. జీవితం,బండి అన్నీ వోవర్ స్పీడ్ లో  జరజరా జారి పోతుంటాయి. రోడ్ డివైడర్లు, మెట్రో  పిల్లర్లు...వారికి దారీయలేవు. అడ్డొస్తాయి.అంతే...

మంత్రి నారాయణ కుమారుడు నితిష్ కూడా చాలా  మంది విఐపిల  సంతానం లాగే రోడ్ ప్రమాదానికి గురయ్యారు.
 కారణాలు ఏమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం  లేదు. వీళ్ల ప్రయాణాలు రాత్రి పొద్దుపోయాక, అనుమానాలకు తావిచ్చే సమాయాల్లో సాగుతుంటాయి. అంతా వోవర్ స్పీడ్ లో వెళ్తుంటారు. ఈ రోజు హైదరాబాద్ లో చనిపోయిన నారాయణ కుమారుడు నితిష్ కూడా రాత్రి పొద్దు పోయాక, అనుమానాని తావిచ్చేసమయంలో, అత్యధిక వేగంతో వెళ్తూనే ప్రమాదానికి గురయ్యాడు. అనుమానం లేదు.


గతంలో కూడా ఆయన పలుసార్లు వోవర్ స్పీడ్ వెళ్లి పోలీసుల కంటబడ్డాడు. ఛలాన్లు రాయించుకున్నాడు. ఫైన్ కట్టాడు. ఈ చలాన్ వివరాలను, కెమెరాలో దొరికిన స్పీడ్ వివరాలను ఏషియానెట్ సంపాదించింది.(ఫోటో).


విఐపిలు కొడుకుల జీవితంలో వేగాన్ని నియంత్రించడం కష్టం. ఇలా గే వాళ్ల ఖరీదయిన వాహనాల  వేగాన్ని నియంత్రిచండం కష్టం. 
 గత నాలుగు నెలల్లో నారాయణ కొడుకు మూడు సార్లు ఓవర్ స్పీడ్ తో  వెళ్తుంటే ట్రాఫిక్ వాళ్ళు ఫైన్ వేశారు. నాలుగో సారి అలా ఫైన్ వేయించకోకూడదు. దానికి వేగం మానుకోవాలి. అయితే, అలా జరగలేదని ప్రమాదం తీవ్రత చూస్తే అర్థమవుతుంది. వేగంగా వెళ్లి వేగానికే బలయ్యాడు.

కారు మెట్రో పిల్లర్‌ను అతి వేగంగా వచ్చిన ఢీకొనడంతో నుజ్జునుజ్జయింది. ప్రమాద సమాచారం అందాక  అక్కడికి వచ్చినపోలీసులు దుర్ఘటన చేసి అవాక్కయ్యారు. కారులో ఇరుక్కున వారిని బయటకు తీసేందుకు పోలీసులు గంటర్నర పాటు తీవ్రంగా శ్రమించారు. కారు మందు భాగం మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొట్టడంతో గేర్‌ రాడ్డు విరిగిపోయి కారు వెనకాల దూరంగా పడింది. ప్రమాద సమయంలో నిశిత్‌ కారు డ్రైవింగ్‌ చేస్తున్నాడు. పక్కన అతని స్నేహితుడుకూర్చున్నాడు.

 


నిదానమే ప్రధానం - అతి వేగం ప్రమాదకరం
యువత డ్రగ్స్ కు మత్తుకు బానిస అవ్వకూడదు
స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్
తాగి వాహనాలు నడప రాదు
విఐపిల, సెలెబ్రిటీల కొడుకులకు వినిపించని నినాదాలివి.

click me!