అక్బర్ కి సమాధి... రాణాప్రతాప్ కు పునాది...

First Published May 9, 2017, 2:34 PM IST
Highlights

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాషాయ కోణంలో చరిత్రను వెలికితీసే కొత్త ప్రయత్నానికి తెర తీస్తోందా...?

అఖండ భారతాన్ని ఎందరు రాజులు పాలించినా అందులో మాత్రం చరిత్రలో చిరస్థాయి పేరు తెచ్చుకుంది మాత్రం అక్బర్ మాత్రమే.మొగల్ సుల్తానులలోనే కాదు భారత చరిత్రలోనే ఆయనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయం ఉందంటే అతిశయోక్తి కాదు.

 

అందుకే ఆయన అక్బర్ ది గ్రేట్ గా చరిత్ర పుస్తకాల్లో నిలిచిపోయారు.

 

ఇప్పుడు ఆయన స్థానాన్ని మేవాడ్ రాజు మహా రాణాప్రతాప్ తో భర్తీ చేసే కొత్త ప్రయత్నానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

 

‘చరిత్రకారులందరూ రాణా ప్రతాప్ ను వదిలేసి అక్బర్ ది గ్రేట్ అని పొగుడుతుండటం నాకు ఆశ్చర్యమేస్తుందంటూ’ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

రాణా ప్రతాప్ 447 వ జయంతిని పురస్కరించుకొని  రాజస్థాన్ లోని పాలి జిల్లాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం హోం మంత్రి మాట్లాడారు.

 

స్వగౌరవం, స్వపాలనకోసం రాణా ప్రతాప్ తన జీవితాన్నే త్యాగం చేశారని కొనియాడారు. అక్బర్ ది గ్రేట్ అనడాన్ని నేను వ్యతిరేకించను అయితే రాణా ప్రతాప్ ను కూడా అదే స్థాయిలో గ్రేట్ అనాలని చరిత్రకారులను నేను కోరుకుంటున్నా అని పేర్కొన్నారు.

 

రాణా ప్రతాప్, శివాజీ మహరాజ్ స్ఫూర్తితోనే 1857 తిరుబాటు జరిగిందన్నారు.

 

రాణా ప్రతాప్ కు సరైన పేరు రాకుండా మన చరిత్రకారులు పెద్ద తప్పు చేశారని, ఇప్పుడు ఆ తప్పును సరిద్దిదాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

click me!