
ప్రాంతాలకు పర్సనాలిటి ఉంటుందని ప్రఖ్యాత అర్కియాలజిస్టు ప్రొఫెసర్ బెండపూడి సుబ్బారావు చెబుతారు.
ఈ పర్సనాలిటి భౌగోళిక పరిస్థితుల నుంచి వస్తుంది. ఆ ప్రాంత ప్రజల జీవనవిధానంలో ఈ పర్సనాలిటి తొంగిచూస్తూ ఉంటుంది. ఆహారంలో, ఆతిథ్యంలో, కలుపుగోలు తనంలో అన్నింటా అది ప్రత్యక్షమయి మనల్ని పల్కరిస్తూ ఉంటుంది.తెలుగువాళ్లమయినా, మేమందుకే రాయలసీమ వాళ్లమయినాం. ఇపుడు రాయలసీమ ఒక ప్రత్యేకత గురించి చెబుతాను. దోశను ఉదాహరణగా తీసుకుంటాను.
దోశలో ఎన్నో రకాలు ఉండచ్చు. ప్రాంతానికో రూపంలో రుచిలో రంగులో ప్రాంతీయత ఉంటుంది.
ఇలాంటిదే రాయలసీమ ఎర్ర కారం దోశ. మీరు ఒక సారి తిన్నారంటే ఆ రుచిని, ఆ దోశని ఎప్పటికి మర్చిపోరు. నాది గ్యారంటీ....
కారణం రాయలసీమ విశిష్టత. తాడిపత్రి పట్టణం పేరు విన్నారుగా...
ఎన్నోరకాలుగా తాడిపత్రి గుర్తుండిపోయే పట్టణం. పెన్నానది ఒడ్డున ఉంటుంది.
ఔరా అనిపించే శిల్ప కళా సంపద పొర్లిపొరలే రెండు ప్రాచీనాలయాలు ఇక్కడ ఉన్నాయి. బుగ్గలింగేశ్వరస్వామి, చింతల వెంటకరమణ స్వామి అనే ఈ ఆలయాలను విజయనగర రాజులు కట్టించారు.
తాడిపత్రి యళ్ళనూర్ రోడ్ లో రమణ హోటల్...అనే చిన్న హోటలుంది.
చూసేకి అతి సామాన్యంగా ఉంటుంది కానీ వాళ్ళు వేసే
దోశలు ఒక్కసారి తింటే ఇంక వదలరు...
దోశ రుచిగా రావడం కోసం పెన్నం కింద మంటను ఒక లెవెల్ లో మెయింటెన్ చేయాలట. అందుకే కట్టెల పొయ్యే వాడతారు.. కాలే కాలే పేన్నం మీద ఎర్రటి దోశ...
దానిపై ఉల్లిగడ్డల తో చేసిన ఎర్ర కారం వేసి.. మీరి ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా లేతగా రోస్టుగా చేస్తారు.
ఆపైన కొంచెం పొప్పుల పొడి చల్లి..ఉర్లగడ్డ పళ్ళెం(మసాల) వేస్తారు. అంతటితో ఆగిపోదు వ్యవహారం. రాయలసీమ ప్రత్యేకత అన్నాం కదా...
దోశనను అరిటాకులో పెట్టి... గట్టి రాయలసీమ చేనిక్కాయల చెట్నీ వేసి... వేడి వేడి దోశలు ఆప్యాయంగా చేతికందిస్తారు.
ఈ కాంబినేషన్ లో తింటూంటే ...పోతూనే ఉంటాయి ఎన్నయినా.
ఎర్ర చట్నీ ఎక్కడయినా దొరుకుతుంది.
ఇక్కడి ఎర్ర కారాన్ని ప్రత్యేకంగా రాయలసీమ వాళ్లే తాయారు చేస్తారు, వాళ్ల పద్దతిలో.
ఇంక చేనికాయల చెట్నీ అంటారా, మా సీమ వేరుశనగ పండీయడం లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది..అందుకే
మా ప్రాంతంలో పండే సనక్కయాలకి రుచి ఎక్కువ, అది మా భూమినుంచి వచ్చింది. తాడిపత్రి దోశ మజా ఇవ్వడానికి కారణం ప్రొఫెసర్ సుబ్బారావు చెప్పినట్లు, రాయలసీమలో భూమి నుంచి వచ్చిన దినుసులే...
వేయి రుపాయల ఫైవ్ స్టార్ దోశె మా సీమ దోశ ముందు బలాదూరే.
మిగతా ప్రాంతాల్లో వేసే పప్పుల చెట్నీ చూస్తే మాకు
ముట్టుకో బుద్ధి కూడా కాదు. (ఇది వ్యతిరేకత కాదు, మా ప్రాంతీయ బలహీనత) మా ప్రాంతంలో దోశలకి చాలా ఉర్లు ఫేమస్. అనంతపురం లో గుడ్డు దోశ, కారం దోశ, ప్రొద్దుటూరు లోనయితే ఎన్ని రకాల దోశలో.
అందుకే ఈ సారి తాడిపత్రి పోయినప్పుడు రమణ హోటల్ లో కారం దోస,ఇడ్లి ట్రై చేయండి..
(రాజశేఖర్ రెడ్డి రాయలసీమ బ్లాగర్, కాలమిస్టు)