బామ్మర్దికి పాలిట్ బ్యూరో సీటిచ్చిన చంద్రబాబు

First Published Sep 23, 2017, 6:00 PM IST
Highlights

నందమూరి హరికృష్ణను దూరం చేసుకోవడం నష్టమని చంద్రబాబు భావించినట్లున్నారు

మొత్తానికి  నటుడు నందమూరి హరికృష్ణ స్థానం టీడీపీలో పదిలంగా ఉంది . ఈ మధ్య  చంద్రబాబు బామ్మర్ధి హరికృష్ణ పార్టీలో సర్కిల్స్ లో  ఎక్కడా కనిపించడం లేదు.  పార్టీ కార్యక్రమాలలో ఎక్కడా కనిపించడం లేదు. 2014 ఎన్నికల నాటి నుంచి ఇది కనిపిస్తూ ఉంది. అయితే, ఆయన్ను పూర్తి గా దూరం చేసుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదని  అర్థమవుతుంది. అందుకే ఆయనను  టీడీపీ పొలిట్‌బ్యూరోలో సీటిచ్చి గౌరవించడం సబబుని భావించారు. శనివారం కొత్తగా ఏర్పడిన పొటిట్‌బ్యూరోలో హరికృష్ణకు స్థానం లభించింది. మరి హరికృష్ణ  ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరోవైపు హరికృష్ణ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం  లేదని దీనికి జూనియర్ ఎన్టీఆర్ ను లోకేశ్ కంపెనీ దూరంగా పెట్టడమే కారణమని కొందరి వాదన.

శనివారం ఏపీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలను  ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్ర కమిటీలతో పాటుగా జాతీయ, పొటిట్‌బ్యూరో సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

అయితే పొలిట్‌ బ్యూరోలో రెండు మార్పులు చేశారు. తెలంగాణ నుంచి పొలిట్‌ బ్యూరోలోకి రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్కను తీసుకున్నారు. ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, రమేశ్‌రాథోడ్‌ స్థానంలో రేవూరి, సీతక్కను నియమించారు.

 పొలిట్‌బ్యూరో సభ్యుడుగా నందమూరి హరికృష్ణ కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. 

 

click me!