బ్రహ్మోత్సవాలలో 700 సిసి కెమెరాల నిఘా

First Published Sep 23, 2017, 1:41 PM IST
Highlights

ఏవయినా సమస్యలు ఎదురయినపుడు భక్తులు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18004251111 కు ఫోన్‌ చేయవచ్చు

 శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలలో భక్తుల భద్రత కోసం ఒక్క తిరుమలలోనే 700 సిసి కెమెరాలను ఏర్పాటుచేశారు. బ్రహ్మోత్సవాాలు జరుగుతున్నంత సేపు భద్రతా సిబ్బంది ప్రతిరోజూ 24 గంటల పాటు సెంట్రలైజ్డ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుండి  తిరుమల పట్టణాన్ని మొత్తం పర్యవేక్షిస్తారు. టిటిడిపి ఛీప్ విజిలెన్స్ ఆఫీసర్ ఆకె రవి కుమార్ ఈ విషయాలు వెల్లడించారు. భక్తుల భద్రతే  ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని రవికృష్ణ తెలిపారు. సెంట్రలైజ్డ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సిసి కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించే విధానాన్ని సివిఎస్‌వో శనివారం మీడియా ప్రతినిధులకు వివరించారు.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ తిరుమలలో 700 సిసి కెమెరాలను అమర్చామని చెప్పారు.  మాడ వీధులు, గొల్లమండపం, వాహనమండపం, గ్యాలరీలు తదితర ముఖ్యమైన ప్రాంతాలలో ఉన్న 154 సిసి కెమెరాల ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నిత్య నిఘా వుంటుందని ఆయన చెప్పారు.

టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18004251111

ఏవయినా సమస్యలు ఎదురయినపుడు భక్తులు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18004251111 కు ఫోన్‌ చేస్తే తక్షణం తమ సిబ్బంది స్పందించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. సెంట్రలైజ్డ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో టిటిడికి చెందిన ఇంజినీరింగ్‌, శ్రీవారి ఆలయం, రిసెప్షన్‌, ఆరోగ్యం, వైద్యం, విజిలెన్స్‌, అన్నప్రసాదం, రవాణ, ఎలక్ట్రికల్‌ తదితర శాఖల సిబ్బంది అందుబాటులో ఉండి తమ సిబ్బందికి సహకారం అందిస్తారని వివరించారు.

 

click me!