యాభై నోటోచ్చింది గాని ఎవరూ నమ్మడం లేదు

First Published Sep 23, 2017, 2:04 PM IST
Highlights

కొత్త యాభై నోటు తీసుకుకోవడానికి మార్కెట్లో వ్యాపారస్థులు జంకుతున్నారు

 

హైదరాబాద్, అక్టోబర్ 23:

ఇది కొత్తగా వచ్చిన యాభై నోటు...

బ్లూ, లేత అకుపచ్చ, లేత అరెంజ్ రంగులకు అలవాటు పడిన ప్రజలు ఈ నోటు చూడగానే ముఖం చిట్లించారు.

ఈ నోటు తీసుకుని రోడ్డెక్కిన నాకు ఎక్కడ సహకారం దొరక లేదు. నోటు చూసి చూడక ముందే అనుమానం వ్యక్తం చేశారు.  ఈ రంగేమిటి?  ఇదసలు నోటు లాగే లేదన్నారు. బొమ్మనోటని ఎగతాళి చేశారు. నకిలీదన్నారు.

మాకుద్దు పొమన్నారు.

మొదట్ దిల్ షుక్ నగర్ టీ కొట్టు దగ్గిర మార్చే ప్రయత్నం చేశాను. నోటును ఎగాదిగా చూసి ఇది చెల్లదన్నాడు. తానెపుడూ ఈ నోటు చూడలేదు. వేరే నోటు ఇవ్వమన్నాడు.

తర్వాత ఒకటిఫిన్ సెంటర్లో కూడా ఇదే అనుభవం.  నోటు కొత్తదే కావచ్చే. మా కింకా రాలేదు. వద్దులేండి వేరేది ఇవ్వమన్నాడు.

తర్వాత ఆటోలో ఇదే పరిస్థితి ఎదురయింది. అప్పటికి ఆటో వాలా ఒక చోట ఆపి పెట్రోలు పంపులో మార్చే ప్రయత్నం చేశాడు, కుదర్లేదు. నోటు గురించి డిస్కషన్ జరిగింది తప్ప ఎవరూ నోటు తీసుకునేందుకు ముందుకు రాలే.

కూరగాయల మార్కెోట్లో ఇదే సమస్య. కొత్తదయిన నువ్వే వుంచుకోసారూ, మాకు పాతదే ఇవ్వరాదూ  ధీర్ఘాలు తీసింది ఒక తల్లి.

అక్కడ కొద్ది సేపు డిస్కషన్, కూరగాయలు అమ్మేవాళ్లు, కొనడానికి వచ్చిన వాళ్లు నోటు తీసుకుని అటూ ఇటూ తీసుకుని అనుమానమే వ్యక్తం చేశారు.

యాభై నోటు వస్తున్నదని చెప్పారు గాని, ఇంత తొందరగా రావడం కష్టం, డిజైన్ రెడీ కావాలి, ప్రింట్ కావాలి, ఇక్కడి సప్లయి కావాలా... దీనికంతా అయిదారు నెలలు పడుతుంది. ఇంత తొందరగా మార్కెట్లోకి రావడం కుదరదని ఒక చదువుకున్నాయని  నన్నింకా ఇబ్బంది పెట్టాడు. దీనితో నోటు నాచేతిలో పడేసి అంతా వ్యాపారాల్లో పడిపోయారు. కొంచెం అవమానకరంగా నే అక్కడి నుంచి కదిలాను. 

ఈ సారి సిటి బస్సెక్కాను. నా దగ్గిర రెగ్యలర్ పాస్ ఉంది. అయినా సరే,  దిల్ షుక్ నగర్ అన్నారు. ఏడు రుపాయలు చిల్లరుందా అన్నాడు. యాభై ఉందన్నాను. చేతికిచ్చాను... చాలా విసురుతా చేతిలో పెట్టి... ఇదేం నోటు బై, ఇస్తే చిల్లరివ్వు లేదా దిగిపో అన్నాడు, ములాజేమి లేదన్నట్లుగా. ఇది కొత్త నోటన్నాను. వద్దన్నా... నోటు మీద అనుమానం వ్యక్తం చేయకుండా ‘అరే బాయ్ సాబ్ చిల్లర్లేదు.,’అన్నాడు.అపుడు నేను నా పాస్ చూపించాను. కొత్త నోటును ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దామని ఇలా చెశానన్నాడు. అపుడు నోటో తీసుకుని ఎగాదిగా చూసి, సీరియస్ గా లేదు, ఈ కలర్ మరీ ఎత్తి కొడతా ఉంది.నోట్ల కలర్ ఇట్ల ఎపుడూ రాలేదన్నాడు. ఇదీ సంగతి. నా నోటు నేను జేబులోపెట్టుకుని బస్సుదిగిపోయాను.

ఈ నోటును రిజర్వ బ్యాంక్  విడుదల చేసింది ప్రస్తుతం బ్యాంకుల్లో దొరుకుతూ ఉంది.

పది రుపాయల నాణెం లాగా దీనిని    ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇది ప్రజామోదం పొందేందుకు ఎంతటైం పడుతుందోచూడాలి.

 

click me!