మే 24న రాయలసీమ బంద్

First Published May 22, 2017, 1:12 PM IST
Highlights

అమరావతి తప్ప మరొక ద్యాస లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా, రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా ఈ నెల 24న రాయలసీమ బంద్‌ నిర్వహిస్తున్నారు.అనంతపురం, కడప, కర్నూలు, చితూరు జిల్లాల ప్రజలు స్వచ్ఛందంగా  బంద్ లో  పాల్గొన్ని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన తెలిపి,రాయలసీమకు న్యాయం జరిగే లా వత్తిడి తీసుకురావాలని సిపిఐ  సిపిఎం పిలుపునిచ్చాయి.

అమరావతి తప్ప మరొక ద్యాస లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా, రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా ఈ నెల 24న రాయలసీమ బంద్‌ నిర్వహిస్తున్నారు. అనంతపురం, కడప, కర్నూలు, చితూరు జిల్లాల్లో బంద్ పాటించాలని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్ని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన తెలిపి,రాయలసీమకు న్యాయం జరిగే లా వత్తిడి తీసుకురావాలని సిపిఐ  సిపిఎం పిలుపునిచ్చాయి.

 

సోమ‌వారం  విజయవాడలోని దాసరిభవన్‌లో బంద్‌కి సంబంధించి రూపొందించిన గోడపత్రికను నాయకులు ఆవిష్కరించారు.  కార్యక్రమంలో సిపి ఐ కార్యదర్శి రామకృష్ణ , సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జి.ఓబులేసులు పాల్గొన్నారు.

 

రామకృష్ణ మాట్లాడుతూ 24న త‌ల‌పెట్టిన బంద్‌కు ప‌లు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతిచ్చాయని తెలిపారు. రాయలసీమలో 1.30 కోట్ల మంది జనాభా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 807 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారని, ఒక్కసారైనా కరవు మండలాల పరిస్థితులపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారా అని ప్రశ్నించారు. రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది 184 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలో గడ‌చిన ఆరేళ్లుగా 63 మండలాలను కరవు మండలాలుగా ప్రకటిస్తూనే ఉండటం వల్ల కరవు తీవ్రత ఎంతగా ఉందో అర్ధం అవుతుందన్నారు. ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంటుందేగానీ, సహాయక చర్యలు చేపట్టడంలో, వలసలు నివారించడంలో విఫలమైంద‌ని విమర్శించారు.

 

రాయలసీమ ప్రాంతం నుండి లక్షలాది కుటుంబాలు సుదూర ప్రాంతాలకు వలసలు పోతున్నారని, ఇది రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుచేటు కాదా అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులు సరిగా కల్పించక‌పోవ‌డంతో పాటు ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు చేయక‌పోవ‌డంతో వలసలు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు.

 

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా రైతులకు చెల్లించాల్సిన రు.4500 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించలేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరచిన విధంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ప్రకటించకుండా కేవలం జిల్లాకు సంవత్సరానికి రు.50 కోట్లు చొప్పున ఇప్పటికి రు.150 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు.

 

 సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడులు రప్పించేందుకు, ఆదాయం పెంచేందుకు విదేశీ యాత్రలు చేస్తున్న‌ట్లు చెబుతున్నారనీ, స్థానికంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలు మూతబడి వేలాది మంది కార్మికులు వీధిన పడుతుంటే పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. గత నాలుగేళ్ళ కాలంలో కేంద్రం నుండి దక్షిణాది రాష్ట్రాలు పొందిన కరవు సహాయం కూడా ఆంధ్రప్రదేశ్ పొందలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక శ్రద్ధ ఉందని చెబుతున్న బిజెపి నేతలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఏం సహాయం చేశారో చెప్పి రాష్ట్రానికి రావాలన్నారు. టిడిపి, బిజెపిలు ఇప్పటి నుండే 2019 ఎన్నికల ఎత్తుల గురించి స‌మావేశాలు పెడుతున్నారుగానీ, ప్రజల సమస్యలను ఏ విధంగా ప‌రిష్క‌రించాలో అనే అంశంపై చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు.

click me!