తెలంగాణా పడకూడని వారి చేతిలో పడింది...

Published : Jun 10, 2017, 08:46 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
తెలంగాణా పడకూడని వారి చేతిలో పడింది...

సారాంశం

సీమకు కన్నీళ్లే తప్ప నీళ్ళు లేవు. తెలంగాణా లో ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్ళొస్తున్నాయి. ఆంధ్రలో కూడా నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి. సీమలోనే సాగు తాగునీరు కరవుంది.తెలంగాణా ఎవరి చేతికి రావాలో వాళ్ళ చేతికి రాలేదు. ఎవరి చెంతకు వెళ్ళకూడదో వాళ్లకు దక్కింది.

కాలజ్ఞాని వీరబ్రహ్మం గారి జీవితంతో తో తన జీవితాన్ని ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ పోల్చుకున్నారు.

 

బ్రహ్మంగారి మాదిరే తన జీవితం ప్రజాసేవకే అంకితం చేశానని ఆయన చెప్పారు. ఈ రోజు కడపలో ఉన్న గద్దర్  జిల్లాతో తనకు 21 ఏళ్ళ వయసప్పటినుంచే అనుబంధం ఉందని చెప్పారు.

 

1973 లో అజ్ఞాతంలో ఉన్నప్పుడు ప్రొద్దుటూరు పులివెందుల పాలిటెక్నీక్  కళాశాలల్లో ఉన్నానని అంటూ జిల్లాలోని ప్రతిగ్రామం తనకెరికే అన్నారు. ఈ ప్రాంతం పై ఎన్నో పాటలు రాశానని, కడప దర్గా పై కూడా పాటలు రాశానని ఆయన చెప్పారు.

 

‘సీమకు కన్నీళ్లే తప్ప నీళ్ళు లేవు. తెలంగాణా లో ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్ళొస్తున్నాయి. ఆంధ్రలో కూడా నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి. సీమలోనే సాగు తాగునీరు కరవుంది,’ అని గద్దర్ అవేదన చెందారు.      

                 

‘‘తెలంగాణా ఎవరి చేతికి రావాలో వాళ్ళ చేతికి రాలేదు. ఎవరి చెంతకు వెళ్ళకూడదో వాళ్లకు దక్కింది.అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా. తెలంగాణా విడిపోయే సమయంలో  రాయలసీమ డిమాండ్ల విషయాన్ని నేను గట్టిగా ప్రస్తావించాను. ఇపుడు సీమవాసులు కన్నీళ్లు కాదు.. నీటికోసం ఉద్యమించాలి. తెలంగాణా వచ్చినా రైతుల ఆత్మహత్యలు తగ్గలేదు.అలాగే రాయలసీమ ఉత్తరాంధ్రలోను రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి,’ అని గద్దర్ అన్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !