పాపం.. ‘పల్లె’..!

First Published Nov 11, 2017, 6:06 PM IST
Highlights
  • చీఫ్ విప్ గా నామినెట్ అయిన పల్లె
  • సంబరాలు చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు

‘బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి’ అనే సామేత గురించి వినే ఉంటారు. ఇందుకు నిదర్శనం పల్లె రఘునాథ రెడ్డి. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక.. సామాచార శాఖ మంత్రిగా పల్లె బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో కాల్వ శ్రీనివాసులు చీఫ్ విప్ గా బాధ్యతలు చేపడుతున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాల్లో వారిద్దరి పదవులు కూడా మారిపోయాయి. మంత్రి వర్గ విస్తరణలో కాల్వ అదే సమాచార శాఖ మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. మంత్రి పదవికి ఉద్వాసన పలికిన పల్లె.. విప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీరిద్దరూ అనంతపురం జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం.

తాజాగా చేపట్టిన ఏపీ శాసనసభ, శాసనమండలి పదవుల భర్తీ లో కొద్దిగా ప్రమెషన్ ఇచ్చి పల్లెకు చీఫ్ విప్ పదవిని అప్పగించారు.ఈ పదవుల భర్తీ శనివారం ముగిసిన సంగతి తెలిసిందే.  దీంతో ఆయన సొంత నియోజకవర్గంలోని ప్రజలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఆయనను చీఫ్ విప్ గా నియమించడం పట్ల కొత్త చెరువులో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.

click me!