యూనివర్శిటీ బిల్డింగ్ నుంచి దూకి చస్తామంటున్నారు

First Published Jul 19, 2017, 3:27 PM IST
Highlights
  • ఆంధ్ర ప్రదేశ్ కడప పట్టణంలోని ఫాతీమా మెడికల్ కాలేజి వైద్య విద్యార్దులు ఏన్టిఆర్ హెల్త్ యూనివర్శిటి  పైకి ఏక్కి ఆత్మహత్యకు పాల్పడతామంటూ  నిరసన తెలుపుతున్నారు.
  • ఎంసిఐ అనుమతి రద్దు చేయడం తో ఫాతిమా కాలేజ్ విద్యార్థులు రోడ్డున పడ్డారు. 

 

 

ఆంధ్ర ప్రదేశ్ కడప పట్టణంలోని ఫాతీమా మెడికల్ కాలేజి వైద్య విద్యార్దులు ఏన్టిఆర్ హెల్త్ యూనివర్శిటి  పైకి ఏక్కి ఆత్మహత్యకు పాల్పడతామంటూ  నిరసన తెలుపుతున్నారు.ఎంసిఐ అనుమతి రద్దు చేయడం తోరోడ్డున పడ్డ ఫాతిమా కాలేజ్ విద్యార్థులు రోడ్డున పడ్డారు.గతం లో సీఎంను, మంత్రి కామినేని ని కలిసిన న్యాయం జరగలేదని వారు ఆందోళనకు దిగారు. 

 

తాత్కాలిక పర్మిషన్ తో కాలేజీ నడిపిస్తూ మెడికల్ విద్యార్థులను చేర్చుకున్న కడప కు చెందిన ఫాతిమా మెడికల్ కాలేజీ తరువాత విద్యార్థులను నడి రోడ్డు పై  నిలబెట్టింది .నిబంధలకు విరుద్ధంగా  దరఖాస్తు చెయ్యడం తో MCI కాలేజీ గుర్తింపును రద్దు చేసింది . ఆ విషయాన్ని దాచిపెట్టిన యాజమాన్యం తెల్ల కాగితం పై విద్యార్థుల సంతకాలు తీసుకొని .. అన్ని విషయాలు తెలిసే తమ కాలేజీలో చేరారంటూ చేతులు దులిపేసుకుంది . దీనితో 2015-16,2016-17లకు చెందిన  రెండు విద్యా సంవత్సరాలను కోల్పోయామనీ  అప్పటినుండి తాము పోరాడుతున్నా తమకు న్యాయం జరగటం లేదంటున్నారు విద్యార్థులు . గతం లో తమను పదిమంది చొప్పున వేరే కాలేజీల్లో చేరేలా చూస్తామని వైద్యశాఖా మంత్రి కామినేని హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదని వాపోయారు వారు . ప్రస్తుతం తమ ఫైల్ కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి జేపీ నడ్డా వద్ద ఉందని దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతీసుకుని కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకొనేలా చేయాలనేదే తమ డిమాండ్ అని అన్నారు వారు . దీనిపై నిన్న సీఎం ను కలవాలని చూసినా అనుమతి ఇవ్వలేదనీ.. అందుకే తమకు వేరే దారి దొరకలేదని చెబుతూ విజయవాడ లోనో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బిల్డింగ్ పైకి ఎక్కారు. వెంటనే తమకు న్యాయం చేయకపోతే బిల్డింగ్ పైనుంచి దూకేస్తామని వారు అనడం తో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది . తాము చెల్లించిన ఫీజులు వెనక్కు వచ్చేలా చూస్తామని రాష్ట్ర  ప్రభుత్వం చెబుతుందనీ..అయితే తమకు డబ్బుముఖ్యం కాదనీ.. తాము కోల్పోయిన విద్యాసంవత్సరం ముఖ్యమనీ ..ముందు చెప్పినదాని ప్రకారం తమను వేరే ప్రభుత్వ కాలేజీల్లో అకామిడేట్ చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు . ప్రస్తుతం అక్కడకు చేరుకున్న పోలీసు అధికారులు .. యూనివెర్సిటీ యంత్రాగం విద్యార్థులతో చర్చలు జరుపుతుంది. 

click me!