
నంద్యాల ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినందువల్లే ఈ మధ్య రిటైరయిన తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ (కిందిఫోటో)మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉందని మాజీ ఐఎఎస్ అధికారి ఇ ఎ ఎస్ శర్మ (పై ఫోటో) అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భన్వర్ లాల్ కు నోటీసులు పంపిందో కేంద్ర ఎన్నికల కమిషన్ దర్యాప్తు చేయాల్సి ఉందని డాక్టర్ శర్మ ఎన్నికల కమిషన్ కు ఒక లేఖ రాశారు. ప్రభుత్వం గృహాన్ని ఖాళీ చేయకుండా అట్టిపెట్టుకున్నాడన్న అభియోగం మీద రాష్ట్ర ప్రభుత్వం ఆయన రిటైరవుతున్న రోజునే ఒక నోటీ సు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల అధికారిగా పనిచేసిన సీనియర్ అధికారులకు కేంద్ర ఎన్నికల కసంఘం అండగా ఉండాలని ఆయన లేఖలో పేరొన్నారు. నంద్యాల ఉప ఎన్నికల పుడు తెలుగుదేశం ఆగడాలను అడ్డుకునేందుకు భన్వర్ లాల్ శక్తిమేరా పనిచేశారని పేర్కొంటూ, ఆయనకు నోటీసులు పంపడమంటే, భవిష్యత్తులో ఎన్నికల అధికారిగా నియమితులయ్యేవారిని అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఎలాంటి పరిణామాలుంటాయో నని పరోక్షంగా హెచ్చరిక చేయడమేనని డాక్టర్ శర్మ పేర్కొన్నారు. సర్వీస్ వ్యవహారాలను సాకుగా చూపి ఎన్నికల అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉందని, ఈ ధోరణిని తుంచేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వార్తలు ఇక్కడ.