పురందేశ్వరి టార్గెట్ చంద్రబాబేనా..?

Published : Nov 02, 2017, 04:15 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
పురందేశ్వరి టార్గెట్ చంద్రబాబేనా..?

సారాంశం

చంద్రబాబుని టార్గెట్ చేసిన పురందేశ్వరి పోలవరంపై కేంద్రానికి లేఖ రాసిన పురందేశ్వరి

ఏపీ సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ.. బీజేపీ నేత పురందేశ్వరి కేంద్రానికి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అలసత్వాన్ని ఆమె కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం చాలా అవసరమని వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనులు చేపడుతున్న ట్రాన్ స్ట్రాయ్ కంపెనీ నిర్వాకాలను ఆమె గడ్కరీకి వివరించారు.

ప్రస్తుత పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ 14% తక్కువ కోట్ చేసి కాంట్రాక్టు దక్కించుకుందని… అంత తక్కువకు ప్రాజెక్టు పూర్తిచేయడం అసంభవమని లేఖలో పేర్కొన్నారు. ఆ కంపెనీకి ఉన్న అనుభవం, సమర్ధత లోటు తెలిసి కూడా రాష్ట్రప్రభుత్వం 3సంవత్సరాల విలువైన సమయం వృధా చేసిందని విమర్శించారు.

కేంద్రం అన్ని విధాలా సహకరించి నిధులు సమకూరుస్తున్నా… రాష్ట్రం వినియోగించుకోలేకపోతుందంటూ పురందేశ్వరి ఎద్దేవా చేశారు.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమయానికి దాఖలు చేయట్లేదన్న పురందేశ్వరి… 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాస ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఏపీకు జీవధారగా మారనున్న పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తిచేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. నితిన్‌ గడ్కరీని కోరారు. ఈ లేఖ ప్రతిని ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లకు కూడా ఆమె పంపించారు. చంద్రబాబుని టార్గెట్ చేసేందుకే పురందేశ్వరి కేంద్రానికి ఈ లేఖ రాశారనేది పలువురి వాదన.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu