
పైప్ కట్ అయ్యి జగన్ కార్యాలయంలోకి నీరు వచ్చిన మాట వాస్తవం.. దాని కోసం కాదు జగన్ పైట్ చేయాల్సింది అని సిపిఐ నారాయణ అన్నారు.
‘‘ మోదీ- చంద్రబాబు చేస్తున్న గోవధ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ మీరు ఫైట్ చేయాలి.. దానిమీద మాట్లాడకుండా నా కొంపలోకి నీరు వచ్చినాయి.. నా బాత్ రూమ్ లోకి నీరు వచ్చినాయి అంటున్నారు.. జగన్మోహాన్ రెడ్డి ఏజెండా అదా.. ఆయన మోదీకి షాష్టంగదండం పెట్టి వచ్చాడు.. మోదీ ఒక దేవుడు ఆ దేవుడి ఎదురుగా ముగ్గురు కోతులు కుర్చున్నారు.. ఒకడు మాట్లాడడు, ఒకడు వినడు, ఒకడు చూడడు.. ఈ మూడు కోతులు చంద్రబాబు, కేసీఆర్, జగన్" అని నారాయణ తన దైన శైలిలో అన్నారు. ఆయన ఈ రోజు ఏలూరు పర్యటనలో ఉన్నపుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
"జగన్ ఒక వర్గ ఓట్ల మీద ఆధారపడి ఉన్నారు. ఈయన ప్రధాని మోదీని కలిశాడు.లోపల ఏమి మాట్లాడింటాడో మీకు తెలుసు, నాకు తెలుసు.. బయటకు వచ్చి ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని ప్రకటించాడు.. నీ రాజకీయం ఎంత ఏనుగు ముందు ఎలుకంత.. ఈయనంట దేశం మొత్తం ఏకగ్రీవంగా మోదీ చెప్పిన అభ్యర్థిని నిలబెట్టాలంట.. లక్ష్మీపార్వతి ఓవర్ యాంబిషన్ చేసి పాపం ఎక్కడికో పోయింది.. శశికళ ఓవర్ యాంబిషన్ చేసి జైలుకు పోయింది.. జగన్ ఓవర్ యాంబిషన్ తో ఇప్పుడు ఫ్లాట్ ఫామ్ మీద తిగుతున్నాడు... రాజకీయాల్లో ఓవరాక్షన్, ఓవర్ యాంబిషన్ కుదరవు.. రాజకీయాల్లో ఉంటే సమస్యలపై పోరాడాలి.. కేంద్రంలో, రాష్ట్రంలో రాజకీయ అవకాశవాదం ఏలుతోంది.. దీనికి ప్రతమ్నాయ మార్గం రావాలి. "