
లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లో లేక ఒడ్డున పడిన చేపలా గిలగిల్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ విభజిస్తే, ఇక రాజకీయాల్లో ఉండనని,చెపి పైకి రాజకీయాలకు దూరంగా ఉన్నా లోలోన మాత్రం రాజకీయాలోచనలతో సతమతమవుతున్నట్లుంది. ఆ మధ్య చంద్రబాబునాయుడిని కలసి, ప్రతికలోళ్ల వూహశక్తి పెద్దపని పెట్టాడు.
ఈ రోజు ఆయన పాల్గొన్న ఒక సమావేశం దగ్గిర అభిమానులనే వాళ్లు గుమికూడి, ‘లగడపాటి, రాజకీయాల్లోకి రావాలి’ అంటూ నినాదాలుచేశారు. విజయవాడలోని కందుకూరి కల్యాణ మంటపంలో కాంగ్రెస్ కార్యకర్త యోహాన్ సంతాప సభ జరిగింది. లడగపాటి కూడ ఈ సభకు హాజరయ్యారు. సమయమూ సందర్భమూ తెలుసుకోకుండా వీరాభిమానాలు లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి రావాలంటూ నినాదాలు చేశారు.
అంటే, అభిమానుల అభీష్టం మేరకు, అనుచరుల వత్తిడి మేరకు ఒక ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చిందన్నమాట.
అవును నిజమే, ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నపుడు ఏర్పాట్లు చేసుకోవాలి. నిర్ణయాలు సమీక్షించుకోవాలి. అవసరమయితే, మార్చుకోవాలి.
ఇందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అమరావతిలో కలుసుకున్నారని చెబుతున్నారు.
విజయవాడ ఎంపి కేశినేని నానికి, చంద్రబాబు నాయుడికి గ్యాప్ వచ్చిందని వార్తలు వెలువడుతున్నపుడు ఆయన బాబు ను కలుసుకున్నారు.
ఆయన రాజకీయాలనుంచి తప్పుకోవడం చాలా డ్రామాల తర్వాత జరిగింది. నిమ్స్ నుంచి పారిపోవడం, పార్లమెంటులో మిరియాలపొడి చల్లడం, హైదరాబాద్ ప్రెస్ క్లబ్బులో తెలంగాణా యువకుల చేతిలో బందీకావడం...
ఇపుడు రాజకీయాల్లోకి రావడానికి కూడా ఏదో డ్రామా సిద్ధమవుతున్నట్లుంది. ఈ నినాదాలు అందులో భాగమే అంటున్నారు.