గాంధీ బాగా తెలివైన శెట్టిగారు లే...

Published : Jun 10, 2017, 03:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
గాంధీ బాగా తెలివైన శెట్టిగారు లే...

సారాంశం

జాతిపిత మహాత్మాగాంధీపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సంచలన  వ్యాఖ్యలు చేశారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఛత్తీష్ గడ్ లో కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శ చేస్తూ ‘గాంధీ చాలా తెలియిన కోమటాయన' (బహుత్ చతుర్ బనియా థా వో) అని అమిత్ షా వ్యాఖ్యానించారు హిందీలో.

జాతిపిత మహాత్మాగాంధీపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా   వ్యాఖ్యాలు చేశారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉంది.

 

ఛత్తీష్ గడ్ లో కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శ చేస్తూ ‘గాంధీ చాలా తెలియిన కోమటాయన(బహుత్ చతుర్ బనియా థా వో)’’  అని వ్యాఖ్యానించారు హిందీలో.  ఈ మాట ఎందుకన్నారంటే,కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం ప్రకారం దేశ స్వాతంత్య్రం  కోసం ఏర్పాటు కాలేదుట. ఈ మాట అంటూ దేశ స్వాతంత్య్రం కోసం ఏర్పాటయిన ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్ పి వి) కాంగ్రెస్ పార్టీ అని షా వ్యాఖ్యానించారు.

 

స్వాతంత్య్రం రాగానే  కాంగ్రె స్ పార్టీని రద్దు చేయాలని గాంధీ చెప్పింది అందుకే, గాంధీ చాలా తెలివయిన కోమటాయనలే అని వ్యాఖ్యానించారు. ఇది గొడవకి కారణం.

 

గాంధీని ఇలా పచ్చి బిజినెస్ మాన్  అని అనడం తో కాంగ్రెస్ పార్టీకి బాగా కోపమొచ్చింది.

 

కోమటాయన అని అనేసి గాంధీని, స్వాతంత్య్ర పోరాటాన్ని, స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వారిని షా అవమానపర్చారని రణ్ దీప్ సూర్జేవాల్ అక్షేపణ తెలిపారు.స్వాతంత్య్రానికి పూరం బ్రిటిషోళ్లు స్పెషల్ పర్పస్ వెహికిల్ వాడుకున్నది, కాంగ్రెస్ ని కాదు,హిందూమహాసభని, ఇపుడు స్వాతంత్య్రం వచ్చాక బిజెపి ఇదే పంథాలో నడుస్తూ ఉందని ఆయన ఆరోపించారు.

అమిత్ షా క్షమాపణలు చెప్పాలన్నారు.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !